Pushpa: సుకుమార్ కు బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడిగా రాజ్ కుమార్ హిరాణీ గొప్పదనం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులకు తెలుసు. ఆయన తెరకెక్కించిన ‘మున్నాభాయ్’, ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయనకు సినిమా రంగంలోనూ ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి అభిమాన దర్శకుడి నుంచి ఓ ప్రశంసాపూర్వక సందేశం అందితే ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉంటుంది. ఆ గౌరవాన్ని తాజాగా అందుకున్నారు దర్శకుడు సుకుమార్. ఆయన ఇటీవలి సినిమా ‘పుష్ప’ సినిమా బాలీవుడ్ లో సంచలన విజయం సాధించింది. ఈ క్రమంలో ఎంతోమంది అక్కడి ప్రముఖులు దర్శకుడు సుకుమార్ ప్రతిభను మెచ్చుకుంటున్నారు. ఇందులో అరుదైన దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా చేరారు.
Also Read
- Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
- Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. 'పెద్ది' సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ ..
- Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
రాజ్ కుమార్ హిరాణీ, ” డియర్ సుకుమార్ ఈ మెసేజ్ మీకు ఎప్పుడో పంపించాల్సింది. ‘పుష్ప’ సినిమా చూసినప్పటి నుంచి మీతో మాట్లాడాలని అనుకుంటున్నా, నా దగ్గర మీ నెంబర్ లేదు. ఒక మిత్రుడు ద్వారా తీసుకున్నా. ‘పుష్ప’ సినిమా గురించి నా మిత్రులతో చాలాసార్లు మాట్లాడాను. ఒక సినిమా గురించి నేను అంతలా మాట్లాడటం వారిని ఆశ్చర్యపరిచి ఉంటుంది. మీ రచన, ప్రతి సన్నివేశాన్ని మలిచిన తీరు, నటీనటుల పర్మార్మెన్స్, సంగీతం ఇలా అన్నీ గొప్పగా ఉన్నాయి. అద్భుతమైన సినిమాను తెరకెక్కించారు. సినిమాను ఆద్యంతం ఆస్వాదించాను. మీరు ముంబై వస్తే ఫోన్ చేయండి. మీట్ అవుదాం” అని సుకుమార్ కు సందేశం పంపారు.
దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సందేశానికి ఎంతో సంతోషంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు సుకుమార్. ఆయన స్పందిస్తూ, ”ఫిల్మ్ మేకింగ్ లో మాస్టర్ లాంటి మీ దగ్గర నుంచి ప్రశంసలు రావడం నాకెంతో ఆనందాన్ని ఇచ్చింది. రైటింగ్ లో, సినిమా రూపకల్పనలో మీరే నాకు స్ఫూర్తి. మీ మెసేజ్ ను నా స్నేహితులందరికీ పంపిస్తున్నాను’ అని అన్నారు. బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ ప్రశంసలతో… సహజంగానే ‘పుష్ప -2’కు ఉత్తరాదిన మరింత క్రేజ్ వచ్చే ఆస్కారం ఉంది.
తాజావార్తలు
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్‌లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్‌ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
-
Virat Kohli: స్టాండ్స్‌లో ‘49’ హంగామా.. కోహ్లీ రియాక్షన్ మాములుగా లేదుగా..!
-
Methi Na Gota Recipe: వర్షం పడేటప్పుడు వేడివేడిగా.. గుజరాత్ స్పెషల్ క్రిస్పీ స్నాక్ రెసిపీ..!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!