Salman: వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌లో అసోసియేషన్‌తో చరిత్ర సృష్టించనున్న ‘టైగర్ 3’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ పరంగా మారు మోగించనుంది. క్రికెట్ వరల్డ్ కప్‌లో జరుగుతన్న మ్యాచ్‌లన్నింటిలో వైఆర్ఎఫ్ సంస్థ టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనుందని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరీ ముఖ్యంగా ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య జరగబోతున్న మ్యాచ్‌లో టైగర్ 3 సినిమా గురించి ప్రమోట్ చేస్తారు. దీని కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ క్రికెట్ వరల్డ్ కప్ కో బ్రాండింగ్ ప్రోమోస్‌లో నటించటం విశేషం.
ఈ ప్రోమోస్‌ను ఈ వన్డే క్రికెట్ వరల్డ్ కప్ కీలక మ్యాచుల్లో ప్రదర్శిస్తారు. ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ మార్కెటింగ్‌లో ఇదే భారీ అసోసియేషన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. 2019లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లను 500 మిలియన్స్‌కు పైగా వీక్షించారు. మరి ముఖ్యంగా 2019లో జరిగిన ఇండియా పాకిస్థాన్ మ్యాచ్‌ను అయితే 200 మిలియన్స్‌కు పైగా చూశారు. మరి 2023లో ఈ సంఖ్య మరింత భారీగా పెరగనుంది. దీన్ని టైగర్ 3 టీమ్ క్యాష్ చేసుకోనుందని సన్నిహిత వర్గాలంటున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ స్సై యూనివర్స్‌లో రూపొందుతోన్న టైగర్ 3 చిత్రాన్ని మనీష్ శర్మ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మాణంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం దీపావళికి రిలీజ్ కానుంది. సల్మాన్ ఖాన్ సరసన కత్రినా కైఫ్ నటించింది.
Also Read
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!