చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రతి అమ్మాయి ఎక్కడో ఒక చోట క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొంటుంది. సక్సెస్ అయ్యాకా చాలామంది వాటి గురించి మాట్లాడరు.. మరికొంతమంది ఆ చేదు అనుభవాలను పంచుకుంటారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ” ఏ నటికైనా ఒక సీరియల్ కానీ, షో కానీ అయిపోయాక కష్టం తెలుస్తోంది. అప్పటివరకు కట్టాల్సిన బిల్స్, ఈఎంఐలు లైన్ గా కనిపిస్తాయి. మళ్లీ కొత్త ప్రాజెక్ట్ ఓకే చేసి చేతిలో డబ్బులు వచ్చేవరకు ఆ కష్టాన్ని భరించాలి. నేను ఒక సీరియల్ అయిపోయాక అదే కష్టాన్ని ఫేస్ చేశాను. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఆ సమయంలో నాకో అవకాశం వచ్చింది. డైరెక్టర్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ ఒకతను వచ్చి.. నువ్వు డైరెక్టర్ తో ఒక రాత్రి పడుకుంటే.. నీకు మంచి అవకాశం ఇస్తారు.. డబ్బులు కూడా వస్తాయి అని చెప్పాడు. అందుకు నేను నన్నే ఇలా ఎందుకు అడుగుతున్నారు అని అడిగాను.. దానికి నేను తెలివైనదానిని అని అతను చెప్పుకొచ్చాడు. ఆ మాట విన్నాకా నేను బయటికి వచ్చేశాను.
ఇండస్ట్రీలో ఇవన్నీ సర్వ సాధారణం.. వాళ్లు చెప్పింది చేయకపోతే మన జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తారని బెదిరిస్తారు. కానీ, నిజం చెప్పాలంటే వారు ఏమి చేయలేరు. ఆ ఆఫర్ ఒప్పుకోకపోయినా వచ్చే నష్టం ఏమి లేదు. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఒకరి కింద తలవంచాల్సిన అవసరం లేదు.వారి ఆఫర్లకు, బెదిరింపులకు నేను లొంగను కాబట్టి దీన్నెప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత నేను నా కష్టంతోనే పైకి వచ్చాను” అని దివ్యాంక చెప్పుకొచ్చింది. ఇకపోతే దివ్యాంక ‘బనూ మే తేరీ దుల్హాన్’ సీరియల్‌తో పాపులారిటీ సంపాదించుకుంది. ‘యే హై మొహబ్బతే’లోనూ డాక్టర్ ఇషితా గా మెప్పించింది. ఈ సీరియల్ తెలుగులో ‘మనసు పలికే మౌన గీతం’ పేరుతో రిలీజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.