నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం “బింబిసార”. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ను సైలెంట్‌గా ముగించుకుని థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజా బజ్ ప్రకారం “బింబిసార” డిసెంబర్ రేసులో చేరుతోంది. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల చివర్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ మేరకు ఈ నెల 29న “బింబిసార” టీజర్ విడుదల కాబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న సినిమా టీజర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also : లేడీ వ్యాపారవేత్త వలలో టాలీవుడ్ హీరోలు… 200 కోట్ల కుచ్చు టోపీ
“బింబిసార” చిత్రానికి నూతన దర్శకుడు మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయిక. చిరంతన్ భట్ సౌండ్‌ట్రాక్ స్కోర్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నారు