నందమూరి కళ్యాణ్ రామ్ 18వ చిత్రం “బింబిసార” శరవేగంగా రూపొందుతోంది. ‘టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. “బింబిసార”ను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె హరికృష్ణ నిర్మించగా, మల్లిడి వశిస్ట్ దర్శకత్వం వహించారు. కేథరిన్ త్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలు. భారీ సెట్స్, అత్యాధునిక గ్రాఫిక్స్, గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రంలో ఉంటాయి. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే ఇది భారీ బడ్జెట్ సినిమా. మ్యూజిక్ డైరెక్టర్ చిరంతన్ భట్, సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు, ఎడిటర్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె వంటి వారు ఈ సినిమాలో భాగమయ్యారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.
Read Also : ఏఆర్ రెహమాన్ కు అరుదైన గౌరవం
టీజర్ లో “ఓ సమూహం తాలూకు ధైర్యాన్ని ఓ ఖడ్గం శాసిస్తే, కొన్ని వందల రాజ్యాలు ఆ ఖడ్గానికి తలవంచి బానిసలైతే… ఇందరి భయాన్ని చూస్తూ పొగరుతో ఓ రాజ్యం మీసం మెలేసింది. అదే త్రిగర్దన సామ్రాజ్యపు నెత్తుటి సంతకం… బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం… ” అనే పెద్ద డైలాగ్ టీజర్ లో ఆకట్టుకునే విధంగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సెట్స్, విజువల్స్ హైలెట్ గా నిలిచాయి. అయితే బింబిసారుడు తన రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు ? అనే విషయాన్నీ సినిమాలో చూపించబోతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. టీజర్ చివర్లో కళ్యాణ్ రామ్ ఆధునిక వస్త్రధారణలో ఉగ్రరూపంలో కన్పించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి టైం ట్రావెల్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా టీజర్ నందమూరి అభిమానులను మెప్పించడమే కాకుండా ఇతర తెలుగు ప్రేక్షకులను సైతం ఆకర్షించింది. అంతేకాకుండా ఫస్ట్ లుక్ తోనే సినిమాపై బజ్ పెంచేసిన మేకర్స్ టీజర్ తో మరింత ఉత్కంఠను రేకెత్తించారు.