BiggBossTelugu7: వచ్చేసింది.. వచ్చేసింది.. అందరు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ మళ్లీ అందరి ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసుకున్న బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అసలు ఎప్పుడో బిగ్ బాస్ మొదలుకావాల్సి ఉండగా.. కొన్ని కారణాలవలన ఆలస్యమయింది. ఇక దీంతో అసలు ఈ ఏడాది బిగ్ బాస్ ఉంటుందా.. ? లేదా.. ? అని ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేసారు. ఇక తాజాగా ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. అభిమానులకు మేకర్స్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. చిన్న అప్డేట్ కూడా లేకుండా బిగ్ బాస్ ప్రోమోను రిలీజ్ చేశారు.”BB7 తెలుగు – వినోదం యొక్క పూర్తి ప్యాకేజీ.. BB7 తెలుగు మిమ్మల్ని ఎమోషన్స్, సర్ప్రైజ్‌లు మరియు థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లో తీసుకెళ్తుంది. కాబట్టి మీరు మరింతగా విండోమ్ ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. శారద గొడవల నుండి హృదయాన్ని కదిలించే కథల వరకు, మిమ్మల్ని అడుగడుగునా అలరిస్తామని మేము హామీ ఇస్తున్నాము” అంటూ స్టార్ మా తెలుపుతూ.. ఒక చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేసింది.
KGF: అప్పుడు ఆర్ఆర్ఆర్.. ఇప్పుడు కేజీఎఫ్.. దేశం దాటి మరీ
నిజం చెప్పాలంటే అభిమానులకు ఇది సడెన్ సర్ ప్రైజ్. దీంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే హోస్ట్ విసయంలో ఇంకా సందిగ్దత నెలకొందని తెలుస్తోంది.అక్కినేని నాగార్జున హోస్ట్ గా చేయడం లేదని టాక్ నడుస్తోంది. ఒక స్టార్ హీరో.. ఈసారి BB7 కు హోస్ట్ గా రానున్నాడట. అంతేకాదు.. ఈసారి అందరు స్టార్ సెలబ్రిటీలు హౌస్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. మరి కొన్నిరోజుల్లో వీరి పేరును అనౌన్స్ చేయనున్నారు. అయితే ఇంకోపక్క నాగ్ ను హోస్ట్ గా వద్దని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆయన ఉంటే సీరియస్ నెస్ రావడం లేదని, కొత్త హీరోను హోస్ట్ గా పెట్టమని అడుగుతున్నారు. మరి ఆ స్టార్ హీరో ఎవరో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.