“బిగ్ బాస్-5” సందడికి టైం ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్-5” ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు నిర్వాహకులు షో స్ట్రీమింగ్ కోసం ముహూర్తం కూడా ఖరారు చేశారు. కింగ్ నాగార్జున బిగ్ బాస్ సీజన్-5కు కూడా హోస్ట్‌గా కొనసాగుతారు. “బిగ్ బాస్ 5” సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమవుతుందని, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఛానల్ లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుందని స్టార్ మా ప్రకటించింది. ఇటీవల మేకర్స్ షోకే సంబంధించిన ప్రత్యేక ప్రోమోలను కూడా విడుదల చేశారు.
Read Also : నాని ట్వీట్… రేపు బిగ్ అప్డేట్
Also Read
వారం రోజులలో పార్రంభం కానున్న “బిగ్ బాస్ 5” ప్రతిరోజూ రాత్రి 10 నుండి ప్రసారం అవుతుంది. వారాంతాల్లో మాత్రం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. పోటీదారుల గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. కానీ షో నిర్వాహకులు మాత్రం కంటెస్టెంట్ల ఇంకా పేర్లను గోప్యంగానే ఉంచింది. పోటీదారులను సెప్టెంబర్ 5న కర్టెన్-రైజర్ ఎపిసోడ్ ద్వారా ప్రకటిస్తారు. అప్పటి వరకూ “బిగ్ బాస్-5” కంటెస్టెంట్ల విషయంలో సస్పెన్స్ తప్పదు. అయితే బయట జరుగుతున్న ప్రచారం మేరకు ఇటీవల కాలంలో యూట్యూబ్ లో ఫేమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్, యాంకర్స్ రవి, వర్షిణి సౌందరరాజన్, ఆర్జే కాజల్, నటి సరయు, హీరోయిన్ ఇషా చావ్లా, డాన్స్ మాస్టర్స్ రఘు, అని, నటరాజ్, విజె లోబో, టీవీ నటుడు, విజె సన్నీ, నటీనటులు శ్వేతవర్మ, మానస్, సిరి హనుమంతు, నవ్యస్వామి, ఆట సందీప్, బాలనటుడు దీపక్ ఈ షోలో పాల్గొనబోతున్నారట.
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!