Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజురోజుకు ఆసక్తిని పెంచేస్తుంది. ముందు ఉన్న ఆరు సీజన్లు ఒక ఎత్తు అయితే .. ఈ ఒక్క సీజన్ మరో ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాగార్జున ముందు చెప్పినట్లుగానే ఈ సీజన్ అంతా ఉల్టా ఫుల్టా గా మారింది. మొదటి రోజు నుంచి కూడా కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇక టాస్క్ ల విషయంలో కూడా ఒక్క్కొక్కరు ఒక్కో స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. నిన్నటికి నిన్న మాయ అస్త్రాన్ని సంపాదించడానికి పెట్టిన గేమ్ లో రణధీర టీమ్ ఫిజికల్ గా ఫైట్ చేసి గెలిస్తే .. మహాబలి టీమ్ ఆడలేక , గెలవలేక .. అస్త్రాలను దొంగతనం చేసి అదొక స్ట్రాటజీగా చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా పర్మిషన్ లేని సంచాలకుడు అయిన సందీప్ రూమ్ లోకి వెళ్లి పవర్ అస్త్రను దొంగతనం చేయడమే కాకుండా .. తమకేమి తెలియదు అన్నట్లు మహాబలి టీమ్ నటించిన నటన మహానటులనే మించిపోయేలా చేసింది.
Pawan Kalyan: కళ్యాణ్ బాబు.. ఎక్కడా తగ్గడం లేదుగా
ఇక మహాబలి టీమ్ లో ఉన్న రతిక తన ఈగోతో హౌస్ లో లేనిపోని గొడవలకు కారణమయ్యింది. పవర్ అస్త్ర కోసం జరిగిన గేమ్ లో మహాబలి టీమ్ లో ప్రతి ఒక్కరు.. రణధీర్ టీమ్ లో ఉన్న వారికి మాయ అస్త్ర మరొకరికి ఇవ్వాలంటూ.. దానికి కారణాలు చెప్పాలి అని బిగ్ బాస్ చెప్పగా .. రతిక చివర్లో వెళతాను అని చెప్పడం .. దానికి టీమ్ వద్దు అనడంతో ఆమె ఈగో హార్ట్ అయ్యింది. దీంతో ఫైర్ అయిన రతిక సొంత టీమ్ నే బపూన్స్ అని నోరు జారింది. ఈ టీమ్ చెండాలం గా ఉంది.. ఈ టీమ్ లో ఉన్నవారందరూ బపూన్స్ అని తిట్టిపోసింది.
Rashi Khanna: క్లీవేజ్ అందాలతో రాశి ఖన్నా కిల్లింగ్ లుక్.. కుర్రాళ్ల మైండ్ బ్లాకే…
గేమ్ లో గెలుపు ఓటములు సహజం.. కానీ టీమ్ ఎఫర్ట్ అనేది ఎంతో ముఖ్యం. కానీ, ఆమె ఆ ఎఫర్ట్ ను కూడా పట్టించుకోకుండా వారిమీదనే ఇలా రివర్స్ అవ్వడం బాగోలేదని అభిమానులు అంటున్నారు. ఆట ఆడడం రాక ఈగో చూపిస్తే ప్రయోజనం ఏంటి అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక మహాబలి టీమ్ లో ఒక్కొక్కరు సరైన రీజన్స్ ఇవ్వకుండా గేమ్ ఆడినా ఫలితం దక్కడం లేదని అమర్ దీప్, శోభ, ప్రియాంక ఫైర్ అయ్యారు. మరి నేడు బిగ్ బాస్ తుదితీర్పు ఎలా ఉంటుందో చూడాలి.