టాలివుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు రాశి ఖన్నా.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు.. ఈమధ్య సినిమా అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి.. కానీ సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్ల తో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ వస్తుంది.. తాజాగా బ్లాక్ ఫిట్ డ్రెస్సులో క్లివేజ్ షో చేసింది.. హాట్ అందాలతో కిల్లింగ్ లుక్ ఫోటోలను నెట్టింట షేర్ చేసింది.. ఆ ఫోటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి..
తాజాగా ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ ఈవెంట్లో రాశి ఖన్నా తళుక్కున మెరిశారు. ఆమె బ్లాక్ డిజైనర్ వేర్లో సందడి చేశారు. రాశి ఖన్నా గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.. బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో రాశి ఖన్నా క్లీవేజ్ అందాలు మైండ్ బ్లాక్ చేశాయి. అవార్డుల ఈవెంట్లో అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి.. ఈ ఈవెంట్ కు అమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.. ఇక ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న రాశి ఖన్నా అక్కడి దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు..
తెలుగులో గత రెండేళ్లుగా హిట్ సినిమాలు లేకపోవడంతో బాలివుడ్ బాట పట్టింది.. అక్కడ పాగా వేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది.. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.. అలాగే తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇకపోతే ఈ అమ్మడు నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..