Bigg Boss Sivaji: ఆ పార్టీలోకి వెళ్తా.. అందరి దూల తీర్చేస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Sivaji on his Political Entry: ఒక వీడియో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి అనేక సినిమాలతో అలరించిన శివాజీ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా అందరినీ అలరించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన #90స్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా మరోసారి ప్రేక్షకులందరినీ పలకరించాడు. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమింగ్ అయింది. అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ కావడంతో ఈ వెబ్ సిరీస్ మీద చూసిన వారందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ టీం ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈ సందర్భంగా నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరు సమైక్యవాది కదా తెలంగాణ ప్రాంతంకి సంబంధించిన పాత్రను పోషించడం ఎలా అనిపించింది అని ప్రశ్నిస్తే దానికి ఆయన స్పందిస్తూ ఒక విషయం మీరు కరెక్ట్ చేసుకోవాలి నేను సమైక్యవాదిని కాదు ప్రత్యేక హోదా కోసం పాటుపడ్డాను, పోరాడాను తప్ప సమైక్యవాదాన్ని ఎప్పుడు వినిపించలేదని అన్నారు. ప్రత్యేక తెలంగాణ అనేది 60 సంవత్సరాల కల అని అది సాకారం అయిపోయింది దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదని అన్నారు. రెండు రాష్ట్రాలు ఇద్దరు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాయని హ్యాపీగా ఉందని అన్నారు.
Google: సెలబ్రిటీల లాగే మీ పేరు కూడా గూగుల్ సెర్చ్ లో కనిపించాలా? అయితే ఈ చిన్న పని చేయండి చాలు
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
అలాగే ఎలక్షన్స్ వచ్చిన రాకపోయినా నేను ఎప్పుడూ డైరెక్ట్ పాలిటిక్స్ లో పాల్గొనే వాడిని కాదు, నాకు రాజకీయాలకు సంబంధం లేదన్నారు. నాకు రాజకీయాల కన్నా యాక్టింగ్ కెరియర్ అంటేనే ఇంట్రెస్ట్ మా పిల్లలు కూడా అటు వైపే ఉండమన్నారు అని ఆయన అన్నారు. నేను యాక్టింగ్ తప్ప మరోటి చేయను, ఒకవేళ ప్రజలకు సమస్యలు వస్తే మాత్రం అది రేపు పొద్దున వచ్చినా సరే ఎప్పుడు వచ్చినా సరే ప్రజా సమస్యల కోసం వారికి ఒక గొంతుకలా ఉంటాను. నన్ను కావాలని ఒక పార్టీకి అంటగట్టాలని చూస్తే కచ్చితంగా ఆ పార్టీలోకి వెళతా, అందరి దూల తీర్చేస్తాను కాబట్టి నా జోలికి రావద్దని అన్నారు. నేను నిజాలు మాట్లాడతాను కాబట్టి అందరికీ ప్రాబ్లమే. సో అలాంటివాడు రాజకీయాలకు పనికిరాడు, నేను రాజకీయాల్లో పనికిరాను అని నాకు తెలుసు. కానీ ప్రజలు గొంతుకులా మాత్రమే ఉంటాను, నేను ప్రజల సమస్యల గురించి మాత్రమే మాట్లాడుతాను అది గుర్తించండి. ఒకవేళ మీరు గుర్తించలేకపోయినా నాకు వచ్చే సమస్య ఏమీ లేదు. మీరు గుర్తించకపోయినా శివాజీ -శివన్న ప్రజల గొంతుక ఆ గొంతుక నేను చనిపోయే వరకు మూగబోదు, నేను జనం కోసమే ఉన్నాను అంటూ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!