Bigg Boss Telugu: ఈసారి కూడా అమ్మాయే ఎలిమినేట్.. ఏంటీ నాగార్జున ఇది.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg Boss Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. రోజు రోజుకి ఉత్కంఠను కలిగిస్తుంది. ఇప్పటివరకు ఏ సీజన్ కూడా ఈ రేంజ్ లో ఆసక్తిని కలిగించలేదు అంటే అతిశయోక్తి కాదు. మొదటినుంచి కూడా ఈ సీజన్ ఉల్టా పుల్టా గా ఉంటుంది అని చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే ప్రతి టాస్క్ లోను, ప్రతి నామినేషన్ లోను, బిగ్ బాస్ వైవిధ్యాన్ని చూపిస్తూ వస్తున్నాడు. ఎలిమినేట్ అయినా గౌతమ్ మళ్లీ లోపలికి రావడం, ఇంకో ఐదుగురు వైల్డ్ కార్డ్ ద్వారా లోపలికి వెళ్లడం పాత, కొత్త కంటెస్టెంట్ల మధ్య వివాదాలు తారస్థాయికి చేరడం..ప్రతివారం ఎక్స్పెక్ట్ చేయనివారు ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవ్వడం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ఈ సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆరుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఆందులోనూ లేడీ కంటెస్టెంట్స్ కావడం విశేషం. షకీలా, కిరణ్ రాథోడ్, దామిని, శుభశ్రీ, నయని పావని, రతిక ఎలిమినేట్ అయ్యారు. ఆరు వారాలుగా అమ్మాయిలే ఎలిమినేట్ అవుతుండడం అభిమానులకు కూడా చిరాకు తెప్పిస్తుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏడో వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది.
Mangalavaram: మంగళవారం అని అందుకే పెట్టాం… ఆ సామెత పట్టించుకోవద్దు: అజయ్ భూపతి
Also Read
ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఏడుగురు ఉన్నారు. పల్లవి ప్రశాంత్, అమరదీప్, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పూజామూర్తి, అశ్విని, భోలె షావళి ఈ లిస్టులో ఉన్నారు. ఓటింగ్ పరంగా చూసుకుంటే పల్లవి ప్రశాంత్, అమర్ టాప్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం మిగతా ఐదుగురిలో పూజా మూర్తి ఎలిమినేట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం హౌస్ లో బూతులు, ఆడపిల్లలపై కామెంట్స్ చేసి ఇరిటేట్ చేసిన భోలే ఎలిమినేట్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అందుకు విభిన్నంగా పూజ ఎలిమినేట్ అవ్వడం అందరిని షాక్ కు గురిచేస్తుంది. లాస్ట్ రెండు స్థానాల్లో పూజ, అశ్విని ఉన్నారని.. వీళ్ళల్లో ఓటింగ్ పరంగా చూసుకుంటే పూజకే తక్కువ శాతం వచ్చాయని అందుకే ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!