Amazon Prime: ప్రస్తుతం ప్రేక్షకుల చూపు మొత్తం ఓటిటీల మీదనే ఉంది అంటే అతిశయోక్తి కాదు. సినిమా మంచి టాక్ వస్తేనే తప్ప థియేటర్ల ముఖం చూడడం లేదు ప్రేక్షకుడు. ఓటిటీలో చూడొచ్చులే అంటూ లైట్ తీసుకుంటున్నాడు. ఇక ప్రేక్షకుడు మానస్ ఎరిగిన ఓటిటీలు కూడా వారిని మరింత ఉత్సాహాపర్చాలని తాపత్రయం పడుతున్నాయి. ఓటిటీ రంగంలో పోటీ కూడా అలాగే ఉంటుంది. సినిమా కొనాగులు చేయడానికి ఓటిటీ యాజమాన్యం ఎంతో కష్టపడుతుంటాయి. ఇక సిరీస్ లు, ఒరిజినల్ ఫిల్మ్స్ అవన్నీ ఎలాగూ కంటెంట్ మీద ఆధారపడి ఉంటాయి. అయితే ప్రస్తుతం ఓటిటీ రంగంలో మొదటి స్థానంలో ఉంది నెట్ ఫ్లిక్స్. దీన్ని కొట్టడానికి అమెజాన్ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ ను ఢీకొట్టబోయి అమెజాన్ బోల్తా పడింది. ఎలా అంటే.. నెట్ ఫ్లిక్స్ లో హాలీవుడ్ సినిమాలకు మంచి గుర్తింపు ఉంది. హాలీవుడ్ అంటే నెట్ ఫ్లిక్స్ అనే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం అమెజాన్ కూడా అదే పేరును తెచ్చుకోవడానికి ఒక హాలీవుడ్ వెబ్ సిరీస్ ను రంగంలోకి దించింది. దాని పేరే.. ‘ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్:ది రింగ్స్ ఆఫ్ పవర్’. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసింది. ఏకంగా రూ. 3700 కోట్లు పెట్టి ఈ సిరీస్ ను అమెజాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ సిరీస్ తో తమకు వ్యూయర్స్ వస్తారని, సిరీస్ హిట్ అయితే తమ పేరు మారుమ్రోగిపోతుందని అనుకున్నారు. అయితే తాజా సన్నివేశం చూస్తుంటే ఈ సిరీస్ వలన అమెజాన్ రూ. 3700 కోట్లు నష్టపోయిందన్న మాట వినిపిస్తోంది. సెప్టెంబర్ 1 న రిలీజ్ అయిన ఈ సిరీస్ అంత హిట్ టాక్ ను ఏమి తెచ్చుకోలేకపోయింది. సిరీస్ అంతా యావరేజ్ గా ఉందని ప్రేక్షకులు పెదవి విరిచేశారు. దీంతో అమెజాన్ ఆశలు అడియాశలు అయిపోయాయని చెప్పుకొస్తున్నారు. దాదాపు వారం కావస్తున్నా ఈ సిరీస్ పై బబజ్ అస్సలు లేదు. దీంతో ఇప్పటినుంచైనా అమెజాన్ ఎలాంటి కథలు ప్రేక్షకులకు నచ్చుతాయో తెలుసుకొని కొనుగోలు చేయమని నెటిజన్లు సలహాలు ఇస్తున్నారు.