బిగ్ అనౌన్స్.. చిరుతో రాజమౌళి.. మరి త్రివిక్రమ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్‌తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. స్టార్ హీరోల సంగతేమోగానీ.. రాజమౌళి రావడం పక్కా అని తెలుస్తోంది. అంతేకాదు.. ఆచార్య వేదిక పై బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్‌గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారని.. ఆ కొత్త సినిమాను ఆచార్య ఈవెంట్లో ప్రకటించబోతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్టు క్రేజీగానే ఉన్నప్పటికీ.. అసలు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహంగా మారింది.
Watch Acharya Pre release Event Live :
Also Read
- Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్‌స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
- Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈవెంట్లో.. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఆ వేదికపై త్రివిక్రమ్ చేయి పట్టుకొని మరీ ఎంతో ఎగ్జైటింగ్‌గా ప్రకటన చేశారు చిరు. త్రివిక్రమ్ కూడా ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అప్ డేట్ లేదు. త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై మాట దాటేస్తూ వస్తున్నాడు.. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు రాజమౌళితో కూడా.. ఆచార్య వేదికపై చిరు కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్లాగే రాజమౌళి ప్రాజెక్ట్ కూడా ప్రకటనకే పరిమితం కానుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు టైం కేటాయించాల్సిందే. ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్‌తో ఓ సినిమా చేయబోతున్నారు జక్కన్న. ఇక చిరంజీవి ఇప్పటికే నాలుగు సినిమాలను లైన్లో పెట్టారు. దాంతో ఈ కాంబినేషన్ ఈవెంట్ ఎగ్జైట్మెంట్ కోసమేనని.. ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఉదాహరణగా చిరు-త్రివిక్రమ్ అనౌన్స్మెంటేనని చెప్పొచ్చు. అయితే అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన ఉంటుందో లేదో.. మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
తాజావార్తలు
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?