మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్దమైంది. మరో ఐదారు రోజుల్లో థియేటర్లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రి రిలీజ్ ఈవెంట్‌తో హల్ చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్‌కు చీప్ గెస్ట్‌గా ఎవరు రాబోతున్నారనేది సస్పెన్స్‌గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీప్ గెస్ట్‌గా రాబోతున్నారని వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు,…
వర్ధమాన కథానాయకునిగా చిరంజీవి సాగుతున్న రోజులవి. దర్శకునిగా కోడి రామకృష్ణ తొలి ప్రయత్నం కోసం తపిస్తున్న సమయమది. వారిద్దరి కాంబినేషన్ లో ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మించిన ‘ఇంట్లో రామయ్య – వీధిలో కృష్ణయ్య’ ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రంతో చిరంజీవి తొలిసారి తన నటజీవితంలో స్వర్ణోత్సవం చూశారు. మొదటి సినిమాతోనే ‘గోల్డెన్ జూబ్లీ’ పట్టేసిన కోడి రామకృష్ణ ఆ తరువాత మరికొన్ని స్వర్ణోత్సవాలతో ‘గోల్డెన్ జూబ్లీ డైరెక్టర్’ అనిపించుకున్నారు. ఈ సినిమాతోనే ప్రముఖ…
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను…