KGF 2 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ వంటి భారీ చిత్రాలు తెరపైకి వచ్చి ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా మార్చ్ 25న విడుదలైన “ఆర్ఆర్ఆర్”కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు KGF 2 కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. యష్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF 2 మూవీ 2018లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన KGF-1కి సీక్వెల్ గా తెరకెక్కుతోంది. KGF 2 కన్నడ, తెలుగు, హిందీ, మలయాళం మరియు తమిళ భాషలలో విడుదల కానుంది. సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్, అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు. KGF 2 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రానికి లాంగ్ వీకెండ్ బిగ్ అడ్వాంటేజ్ కానుంది.
Read Also : Ram Charan Birthday Celebrations : వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?
ఏప్రిల్ 13న బుధవారం USA ప్రీమియర్లు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 14న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఏప్రిల్ 15 గుడ్ ఫ్రైడే కానుంది. కాబట్టి విడుదలైన వారాంతంలో ఈ చిత్రానికి మూడు రోజుల సెలవు ఉంటుంది. 13 నుంచి 5 రోజుల పాటు సినిమాకు కలసి రానుంది. 13న పప్రీమియర్లు, 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల, 15న గుడ్ ఫ్రైడే, ఇక తదుపరి శనివారం, ఆదివారం వీకెండ్ డేస్ కలసి రానున్నాయి. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే KGF2 విడుదలైన మొదటి ఐదు రోజుల్లో USAలో మంచి వసూళ్లను సాధించే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్‌తో కేజీఎఫ్2కు మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయం.