NTV Telugu Site icon

Prabhas: ‘ఆదిపురుష్’ విజయానికై వైష్ణోదేవి మందిరానికి..

Prabhas

Prabhas

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో టి. సీరిస్ అధినేతలు ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో నిర్మించారు. ప్రభాస్, కీర్తి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి జూన్ 16వ తేదీనే విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ ప్రభాస్ అభిమానులనే కాదు… సగటు సినీ ప్రేక్షకుడిని సైతం మెప్పించలేక పోయింది. దాంతో ఓం రౌత్ మరింత సమయం తీసుకుని, దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేశాడు.

ప్రతికూల ప్రచారం నడుమ థియేటర్లలోకి రాబోతున్న ‘ఆదిపురుష్‌’ సినిమాను విజయపథంలో నడపడానికి దర్శకుడు ఓం రౌత్ దేవుళ్ళ సాయం కూడా తీసుకుంటున్నట్టు అర్థమౌతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ తో కలిసి ఓమ్ రౌత్ జమ్ము కశ్మీర్ లోని వైష్ణో దేవి మందిరానికి వెళ్ళారు. దానికి సంబంధించిన ఫోటోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంగళకరమైన ఆరంభం కోసం ఇక్కడకు వచ్చామని, తమ ‘ఆదిపురుష్‌’ విజయానికై వైష్ణోదేవి మాత ఆశీస్సులు పొందబోతున్నామ’ని ఓంరౌత్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దాదాపు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Show comments