Prabhas: ‘ఆదిపురుష్’ విజయానికై వైష్ణోదేవి మందిరానికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. రామాయణం ఆధారంగా ఓం రౌత్ దర్శకత్వంలో టి. సీరిస్ అధినేతలు ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా త్రీడీలో నిర్మించారు. ప్రభాస్, కీర్తి సనన్, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకుంది. తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి జూన్ 16వ తేదీనే విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీ టీజర్ ప్రభాస్ అభిమానులనే కాదు… సగటు సినీ ప్రేక్షకుడిని సైతం మెప్పించలేక పోయింది. దాంతో ఓం రౌత్ మరింత సమయం తీసుకుని, దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేశాడు.
ప్రతికూల ప్రచారం నడుమ థియేటర్లలోకి రాబోతున్న ‘ఆదిపురుష్’ సినిమాను విజయపథంలో నడపడానికి దర్శకుడు ఓం రౌత్ దేవుళ్ళ సాయం కూడా తీసుకుంటున్నట్టు అర్థమౌతోంది. తాజాగా ఈ చిత్ర నిర్మాత భూషణ్ కుమార్ తో కలిసి ఓమ్ రౌత్ జమ్ము కశ్మీర్ లోని వైష్ణో దేవి మందిరానికి వెళ్ళారు. దానికి సంబంధించిన ఫోటోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మంగళకరమైన ఆరంభం కోసం ఇక్కడకు వచ్చామని, తమ ‘ఆదిపురుష్’ విజయానికై వైష్ణోదేవి మాత ఆశీస్సులు పొందబోతున్నామ’ని ఓంరౌత్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. దాదాపు ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.
Also Read
- Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
- Dorothy : ఎన్నాళ్లకు.. కొత్త సినిమా ప్రకటించిన కోలివుడ్ స్టార్ డైరెక్టర్
- Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
- Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ 'వడ్డీ కాసుల వాడ'లో అదిరే సర్ప్రైజ్... వెంకటేశ్వర స్వామిగా జయం రవి
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!