Bholaa Shankar Pre Release Date Time and Venue Details : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. మరో వారంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ భోళా శంకర్ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంతా అంచనాలను మరింత పెంచింది. ఇక ఈ క్రమంలో ‘భోళా శంకర్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ డేట్, టైమ్, ఎక్కడ జరగనుంది అనే వివరాలను సినిమా యూనిట్ వెల్లడించింది. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుందని చెబుతున్నారు. హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో జరగనున్న ఈ ఈవెంట్ కి సినిమా టీమ్ అంతా హాజరు కానుంది. ఈ ఈవెంట్ ను ఎక్స్ క్లూజివ్ గా ఎన్టీవీ లైవ్ టెలీ కాస్ట్ చేయనుంది.
Sound Party: వీజే సన్నీ ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఈ వివరాలను ఈ సినిమాను నిర్మిస్తున్న ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ వెల్లడిస్తూ “మెగా సెలెబ్రేషన్లకు టైమ్ వచ్చేసింది, ఆగస్టు 6వ తేదీన సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాద్‍లోని శిల్పకళావేదికలో గ్రాండ్ భోళాశంకర్ ప్రీ రిలీజ్ సెలెబ్రేషన్స్ జరగనున్నాయి” అని ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ అయితే తాజాగా ట్వీట్ చేసింది. తమిళ మూవీ వేదాళంకు తెలుగు రీమేక్‍గా భోళా శంకర్ సినిమా రూపొందిందగా చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‍గా నటించింది. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తి సురేశ్ పోషించగా, సుశాంత్ అతిథి పాత్రలో నటించారు. భోళా శంకర్ సినిమాలో రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిశోర్, తులసి కీలక పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమాకి మహతీ స్వరసాగర్ సంగీతాన్ని అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా డడ్లీ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.