Sound Party: వీజే సన్నీ ‘సౌండ్ పార్టీ’కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VJ Sunny’s ‘Sound Party’ poster Launched by MLC Kalvakuntla Kavita: వీడియో జాకీ అంటే అదేనండీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ సీరియల్స్ లో అనేక పాత్రలు పోషించి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక ఈ మధ్య అన్ స్టాపబుల్ మూవీతో అలరించిన ఆయన ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ప్రొడక్షన్ నెం. 1గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వి.జె సన్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటిస్తున్నారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా పేపర్ బాయ్ డైరెక్టర్ జయ శంకర్ సమర్పణలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. సంజయ్ శేరి దర్శకుడుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను తాజాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు.
Also Read
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
- Koffee With Karan: రెండు దశాబ్దాల సంచలనాలకు ఎండ్ కార్డ్.. ‘కాఫీ విత్ కరణ్’కు గుడ్‌బై చెప్పిన కరణ్!
- YouTuber Nandu : నేను బిగ్ బాస్ కోసం రాలేదు.. కుట్ర జరిగింది, అసలు దోషులు వేరే ఉన్నారు!
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ సౌండ్ పార్టీ టైటిల్, పోస్టర్ ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉన్నాయని, కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉండబోతున్నట్లు టైటిల్ చూస్తే అర్థమవుతోందని అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించి దర్శక నిర్మాతలకు , నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నా అని ఆమె అన్నారు. ఇక హీరో వీజే సన్ని మాట్లాడుతూ మా సౌండ్ పార్టీ సినిమా పోస్టర్ ఎమ్మెల్సీ కవిత లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందని, షూటింగ్ అంతా పూర్తయిందని అన్నారు. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందని ఆయన అన్నారు. శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, ఇంటూరి వాసు, చలాకి చంటి, వంటి వారు ఈ సినిమాలో నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
-
IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
-
Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!