Bhimaa : గోపీచంద్ ఆన్ ట్రాక్.. అంచనాలు పెంచేస్తున్న భీమా ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhimaa Trailer Looks Promising: హీరో గోపీచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమే అయింది. దీంతో ఎంతో కేర్ తీసుకుని ఆయన సినిమాలు చేస్తున్నారు. ఇక అలా అయన కన్నడ దర్శకుడు హర్ష దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇక త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్ నిర్మించారు. టీజర్ నుంచి పాటల వరకు సినిమాకు సంబంధించిన ప్రతి ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. రిలీజ్ డేట్ ఎంతో దూరంలో లేకపోవడంతో మేకర్స్ ప్రమోషన్స్ లో డోస్ పెంచారు. దీంతో తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక సినిమాలోని ఆధ్యాత్మిక కోణాన్ని చూపిస్తూ ట్రైలర్‌ను కట్ చేసారు. లోక రక్షకుడైన విష్ణు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు అతను ఇంకెవరో కాదు క్షసులపై యుద్ధం ప్రకటించి క్రూరమైన పోలీసు ఆఫీసర్.
Sundaram Master : హిట్ కొట్టాడుగా.. సుందరం మాస్టర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ఈ ట్రైలర్‌లో గోపీచంద్‌లోని మరో పాత్రను కూడా పరిచయం చేశారు. ఇక కన్నడలో దర్శకుడిగా ఇప్పటికే నిరూపితుడైన హర్ష ఒక లార్జర్ దాన్ లైఫ్ కథతో వస్తున్నాడు. దానికి మైథలాజికల్ టచ్ కూడా ఇవ్వడం ఆసక్తికరంగ్ ఉంది. ఇక ట్రైలర్ లో గోపీచంద్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించాడు. అతను పోలీసుగా కనికరం లేకుండా కనిపిస్తుండగా, మరో రోల్ లో చాలా భయానకంగా ఉన్నాడు. ట్రైలర్‌లో కథానాయికలు ప్రియా భవానీ శంకర్ మరియు మాళవిక శర్మతో సహా ఇతర పాత్రలను చూపించినప్పటికీ, అందరి దృష్టి గోపీచంద్ యొక్క రెండు పాత్రలపై మాత్రమే ఉండేలా కనిపిస్తోంది. ఇక స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ ఆకట్టుకోగా, రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. రమణ వంక ప్రొడక్షన్ డిజైనర్, తమ్మిరాజు ఎడిటర్. కిరణ్ ఆన్‌లైన్ ఎడిటర్, అజ్జు మహంకాళి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్-లక్ష్మణ్, వెంకట్ మరియు డాక్టర్ రవివర్మ కొరియోగ్రఫీ అందించారు. భీమా చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!