హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ

కోలీవుడ్ హీరో సూర్య నటించిన “జై భీమ్” చిత్రం వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 15న వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చారు అంటూ ‘జై భీమ్’ చిత్రబృందం సూర్య, జ్యోతిక, దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం లీగల్ నోటీసు పంపింది. దీని తరువాత సూర్యకు అనేక బెదిరింపులు రావడంతో ఆయనకు పోలీసులు భద్రతను కల్పించారు. ప్రస్తుతం తమిళనాడు, టి నగర్‌లోని సూర్య నివాసం వద్ద ఐదుగురు పోలీసులు ఆయుధాలతో సూర్యకు భద్రతను ఇస్తున్నారు.

కాగా ‘జై భీమ్‌’లోని కొన్ని సన్నివేశాలు వన్నియార్ సంఘం ప్రతిష్టను దిగజార్చాయని నోటీసులో పేర్కొన్నారు. ఈ సంఘం సూర్య, ‘జై భీమ్’ చిత్రబృందం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా నష్టపరిహారంగా రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నోటీసు ఇచ్చిన తరువాత వన్నియార్ సంఘం సభ్యులు సూర్యను బహిరంగంగా బెదిరించారు. పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె) నాగపట్నం జిల్లా కార్యదర్శి సీతమల్లి పళని సామి కూడా సూర్యపై దాడి చేసిన వారికి లక్ష రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు.

Read Also : ‘విశ్వాసం’తో శివకు రజనీకాంత్ సినిమా

టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ చిత్రాన్ని సూర్య, జ్యోతిక 2డి ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ఇరులార్ కమ్యూనిటీ సభ్యులకు కస్టడియల్ టార్చర్ గురించి ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో సూర్య, మణికందన్, లిజోమోల్ జోస్ ప్రధాన పాత్రలు పోషించారు. 2 నవంబర్ 2021న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా జనాల్లో ఎమోషన్‌, స్పార్క్‌ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం జస్టిస్ కె చంద్రు నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కగా, ఐఎండిబిలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి తమిళ చిత్రం ఇదే. ఈ సినిమా ఫలితంగా సీఎం స్టాలిన్ దీపావళి సందర్భంగా గిరిజనుల కోసం పలు సౌకర్యాలు ప్రకటించారు. నిర్మాణ బృందం గిరిజన ప్రజల సంక్షేమం కోసం సీఎం స్టాలిన్‌కు 1 కోటి విరాళాలు ఇచ్చింది. సూర్య కూడా తన భర్తను కోల్పోయిన నిజమైన చినతల్లికి 10 లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

‘జై భీమ్’ సమస్యలు, అలాగే సూర్యకు బెదిరింపుల నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్‌లో అండగా నిలుస్తున్నారు. గత రెండు రోజులుగా # WeStandwithSuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఈ చిత్రానికి తమ సపోర్ట్ ను అందించారు.

Related Articles

Latest Articles