Bheemadevara Pally Branchi Streaming in Amazon prime video: ఈ మధ్య కాలంలో తెలంగాణ నేటివిటీ ఉన్న కథలకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే బలగం లాంటి సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక రమేష్ చెప్పాల దర్శకత్వంలో తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో రూపొందించబడిన భీమదేవరపల్లి బ్రాంచి సినిమా కూడా ఈ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ ఆంధ్ర అనే కాదు నేటివిటీ సినిమాలు ఇష్టపడుతున్న నేటి ప్రేక్షకులకి భీమదేవరపల్లి బ్రాంచి పల్లె ప్రజల జీవన విధానాన్ని అమాయకత్వాన్ని ,సంస్కృతి, సంఘర్షణ వంటి వాటిని కళ్లకు కట్టినట్లు కప్పింది అనడంలో సందేహం లేదు.
Prabhas Fans: సుదర్శన్ థియేటర్లో ప్రభాస్ అభిమానుల రచ్చ.. స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం!
భీమదేవరపల్లి బ్రాంచిలో రాజకీయ నాయకుల తప్పుడు వాగ్దానాలు నమ్మి ప్రజలు ఎలా అవస్థలు పడతారో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించారు రమేష్ చెప్పాల. ఉచిత పథకాల మీద దర్శకుడు తన మాటలతో వ్యంగ్యాస్త్రాలు సంధించారు, ఉచితాలు అసలు ఉచితాలే కాదు!! అవి మరోరకంగా మన మీద వేసే భారాలు”, “ప్రభుత్వాలు పని కల్పించాలి కానీ ప్రజలకు పైసలు ఇవ్వకూడదు” అని రమేష్ చెప్పాల తన సామాజిక స్పృహకి ఒక దృశ్యరూపం ఇచ్చారు. నటీనటులు అందరూ కొత్త వాళ్ళే అయినా పాత్రకి తగ్గట్టు వాళ్ళను ఎన్నుకోవడం వల్ల బాగా కుదిరింది. ఇక ఈ సినిమాలో అంజి వల్గమాన్, సాయి ప్రసన్న,సుధాకర్ రెడ్డి (బలగం ఫేమ్),రాజవ్వ, కీర్తి లత, అభిరామ్, రూప శ్రీనివాస్, బుర్ర శ్రీనివాస్(బీ.ఎస్), శుభోదయం సుబ్బారావు, గడ్డం నవీన్, వంటి వారు నటించగా డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్, రాజా నరేందర్ చెట్లపెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు.