Prabhas Fans attacked sudarshan theater: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోన్న క్రమంలో ప్రముఖ హీరోల ఒకప్పటి సినిమాలను మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ నయా ట్రెండ్ అనూహ్యంగా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతోండడంతో నిర్మాణ సంస్థలు ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు స్టార్ హీరోల సినిమాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ అభిమాన హీరోలు సూపర్ హిట్ సినిమాల్ని మళ్లీ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేస్తున్నారని అర్ధం అవుతోంది. అలా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ యోగి కూడా చేరింది. తాజాగా యోగి సినిమా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పైన తెరకెక్కిన ఈ మూవీని తాజాగా చందు ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై లింగం యాదవ్ రీ-రిలీజ్ చేయగా రీ రిలీజ్ కు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ లు సహకారం అందించడం విశేషం.
Tollywood Producers: అప్పుడు లైట్ తీసుకుని.. ఇప్పుడు లబోదిబోమంటున్నారు
అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్డులో సుదర్శన్ థియేటర్లో యోగి సినిమా రీ రిలీజ్ సంధర్భంగా ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ఆయన హీరోగా నటించిన యోగి సినిమా సుదర్శన్ థియేటర్‌లో రీ రిలీజ్ అయిన క్రమంలో వివాదం చోటు చేసుకోవడంతో స్క్రీన్‌తో పాటు ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు అభిమానులు. థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిల్స్‌తో ఫ్యాన్స్ దాడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈ అంశం మీద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చి పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. స్క్రీన్ వద్దకు వెళ్లొద్దు అని సెక్యూరిటీ చెప్పినందుకు తాగేసి వచ్చి వారితో మాట మాటా పెరిగి థియేటర్ దగ్గర దొరికినవి దొరికినట్టు పగలకొట్టారని అంటున్నారు.