Bhediya: అంతా ఓకేనా… నువ్వు ఏదో ఒకటి చెప్పు పుష్ప!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Dhawan: ‘కాంతార’ భారీ విజయం తర్వాత గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ నుండి రాబోతున్న సినిమా ‘తోడేలు’. వరుణ్ ధావన్, కృతీసనన్ జంటగా నటించిన హిందీ హారర్ – కామెడీ మూవీ ‘భేడియా’కు తెలుగు అనువాదం ఇది. ఈ నెల 25న హిందీ, తమిళ భాషలతో పాటు తెలుగులోనూ ఇది విడుదల అవుతోంది. తెలుగు సినిమాను అల్లు అరవింద్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్, పాటలు వ్యూవర్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇది సమ్ థింగ్ స్పెషల్ మూవీగా ఉండబోతోందనేది ప్రేక్షకులకు అర్థమైపోయింది. తాజాగా ఈ మూవీలోని ‘అంతా ఓకేనా… ‘అనే పాటను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ పాటను వరుణ్ ధావన్, అభిషేక్ బెనర్జీ, పాలిన్ కబక్ పై చిత్రీకరించారు. అరుణాచల్ ప్రదేశ్ లోని నిర్మలమైన రోడ్ల గుండా వీరు కారు డ్రైవింగ్ చేస్తూ పాడే పాట ఇది. ఈ పాట ముగ్గురు స్నేహితుల మధ్య ఉన్న స్నేహాన్ని, బంధాన్ని చక్కగా చూపించింది. విశేషం ఏమంటే… సరదా సంభాషణలతో సాగే ఈ పాట మధ్యలో ‘నువ్వు ఏదో ఒకటి చెప్పు పుష్పా’ అని రావడం భలేగా అనిపిస్తుంది. ఈ ముగ్గురు మిత్రులు ఉపయోగించే పాత మారుతీ 800 కూడా నాస్టాల్జియాను రేకెత్తిస్తుంది. ఈ పాటను సచిన్-జిగర్ స్వరపరచగా, సంతోష్ హరిహరన్, వేలు, కె.జె. అయ్యనార్ గానం చేశారు. దీనికి అమితాబ్ భట్టాచార్య, యనమండ్ర రామకృష్ణ సాహిత్యం అందించారు. ‘తోడేలు’ సినిమా నుండి విడుదలైన నాలుగో పాట ఇది. మరి శుక్రవారం ముందుకు వస్తున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో వేచి చూడాలి!
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Sachin Tendulkar: “ఓటమి ఓకే కానీ మోసం నేరం”.. NEET విద్యార్థుల ఉద్యమంపై సచిన్ భావోద్వేగ సందేశం!
-
Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!