Bharateeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి రెడ్ జయింట్ పిక్చర్స్ సంస్థ సహనిర్మాణ సంస్థగా వ్యవహరించింది. ఇక ఈ సినిమాని జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే తమిళ వర్షన్ సెన్సార్ పూర్తికాగా ఈరోజు తెలుగు వర్షన్ సెన్సార్ పూర్తయింది. తమిళ తెలుగు వెర్షన్స్ కి నిడివి విషయంలో మాత్రం ఎలాంటి తేడా లేదు. మూడు గంటల నాలుగు సెకండ్ల పాటు ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.
Also Rrad:Manchu Vishnu : సోషల్ మీడియాలో నటీనటుల మీద ట్రోలింగ్ వీడియోలను ఇక సహించం.. మంచు విష్ణు వార్నింగ్
ఇక శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జె సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించారు. సుమారు 28 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాని ఒకే భాగంగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ నిడివి బాగా పెరిగిపోయిన నేపథ్యంలో భారతీయుడు 3 కూడా రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాని మరో ఆరు నెలల తర్వాత రిలీజ్ చేసే యోచనలో సినిమా టీం ఉంది. అయితే ఆశించిన మేర ఆన్లైన్ బుకింగ్స్ అయితే కనిపించడం లేదు .కేవలం 30 నుంచి 40% వరకే బుకింగ్స్ అయినట్లుగా ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందనేది.