2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకి లైన్ క్లియర్ చేసాడు. ఇప్పుడు దసరాకి మళ్లీ బాలయ్య, విజయ్ ల మధ్య వార్ జరగబోతుంది. భగవంత్ కేసరి సినిమాతో బాలకృష్ణ, లియో సినిమాతో దళపతి విజయ్ లు బాక్సాఫీస్ బరిలో ఉన్నారు.
Read Also: Naga Vamshi: మేము రావట్లేదు అనుకుంటున్నారేమో… వస్తున్నాం రికార్డులు కొడుతున్నాం
ఈ ఇద్దరికీ పోటీగా మాస్ మహారాజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ఈ సినిమా విషయం కాసేపు పక్కన పెడితే లియో సినిమా రైట్స్ ని సొంతం చేసుకున్న నాగ వంశీ మాట్లాడుతూ… లియో సినిమా రైట్స్ ని నేను తీసుకోవడమే బెటర్, బాలయ్యకి భగవంత్ కేసరి సినిమాకు థియేటర్స్ విషయంలో ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటాను అంటూ మాట్లాడాడు. తన సొంత సినిమాకి థియేటర్స్ విషయంలో కాస్త అటు ఇటు అయినా అభిమాన హీరో బాలకృష్ణ సినిమాకి మాత్రం థియేటర్స్ తగ్గకుండా చూసుకుంటాను అని చెప్పడం నాగ వంశీ గొప్పదనం అనే చెప్పాలి. మరి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటాయి అనేది చూడాలి.