ప్రొడ్యూసర్ నాగ వంశీ… ఎప్పటిలాగే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడాడు. తనకి అనిపించింది, తన సినిమా గురించి చాలా ఓపెన్ గా మాట్లాడే నాగ వంశీ మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా నాగ వంశీ ‘గుంటూరు కారం’ సినిమా గురించి కూడా మాట్లాడాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా గుంటూరు కారం. ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారీ అంచనాలు ఏరపడ్డాయి. 12 ఏళ్ల తర్వాత సెట్ అయిన కాంబినేషన్ కావడంతో హైప్ ఆకాశాన్ని తాకింది. ఆ తర్వాత గుంటూరు కారం సినిమా స్టార్ట్ అవ్వడం, మధ్య మధ్యలో మహేష్ ఫారిన్ ట్రిప్స్ తో బ్రేక్ రావడం లాంటివి జరిగి… గుంటూరు కారం సినిమాపై రకరకాల రూమర్స్ బయటకి వచ్చాయి. పూజా హెగ్డే కూడా తప్పుకోవడంతో గుంటూరు కారం సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుంది అనే చర్చ సోషల్ మీడియాలో మొదలయ్యింది.
ఎలాంటి గందరగోళం లేదు, ముందు చెప్పినట్లుగానే గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని మహేష్ బాబు ఇటీవలే కన్ఫర్మ్ చేసాడు. స్వయంగా మహేష్ బాబు సంక్రాంతికి వస్తున్నాం అనే విషయం చెప్పినా కూడా సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ ఒకటి ఆరు సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. మహేష్ బాబు సినిమా రిలీజ్ రేస్ లో ఉంటే… ఒకటీ రెండు సినిమాలు, అది కూడా పండగ సీజన్ కాబట్టి రిలీజ్ అవుతాయేమో కానీ లేదంటే మహేష్ సినిమా ఉండగా ఇంకో సినిమా అదే డేట్ కి రిలీజ్ అవ్వడం అనేది జరగని పని. ఇదే విషయాన్నీ నాగ వంశీ కూడా మరోసారి పక్కాగా చెప్పాడు. జనవరి 12 డేట్ ని మిస్ అయ్యే ప్రసక్తే లేదు. కొందరికి మేము వస్తామో రామో అనే డౌట్ ఉందేమో… మేము కచ్చితంగా వస్తున్నాం. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో లేనంత ఎనర్జీ గుంటూరు కారం సినిమాలో చూస్తారు. మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ రిలీజ్ జరగబోతుంది అని నాగ వంశీ కుండా బద్దలుకొట్టినట్లు… మాతో జాగ్రత్త అనే విషయాన్నీ చెప్పేసాడు. మరి నాగ వంశీ మాటలు విని లేదా గుంటూరు కారం ట్రైలర్ చూసైనా రిలీజ్ డేట్స్ వెనక్కి వెళ్తాయేమో చూడాలి.