Skanda VS Bhagavanth kesari TRP Ratings: థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు చాలా ఆలస్యంగా టీవీలో టెలికాస్ట్ అవుతున్నాయి. అయితే థియేటర్లలో రిజల్ట్ తో సంబంధం లేకుండా టీవీ ఆడియన్స్ సినిమాలను చూస్తున్న తీరు హాట్ టాపిక్ అవుతుంది. థియేటర్లలో హిట్ అయిన సినిమాని బుల్లితెర ప్రేక్షకుల పెద్దగా ఆదరించడం లేదు సరి కదా ఇక్కడ దారుణమైన డిజాస్టర్ అని భావించిన సినిమాలను మాత్రం బుల్లితెర మీద హిట్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇప్పుడు మరోసారి మరో రెండు సినిమాలు తాజాగా ప్రూవ్ చేశాయి. అసలు విషయం ఏమిటంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన స్కంద సినిమాతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలు ఒకే రోజు టీవీల్లో టెలికాస్ట్ అయ్యాయి.
Balagam Venu :నా బలగం నాన్న తప్ప అందరూ చూశారు.. వేణు ఎమోషనల్ పోస్ట్
సాధారణంగా అందరూ హిట్ సినిమా మీద ఆసక్తి చూపిస్తారు అనుకుంటే అందుకు భిన్నంగా దారుణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న స్కంద సినిమా మీద ఆసక్తి చూపించడం గమనార్హం. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్కంద సినిమాను స్టార్ మా ఛానల్ లో ప్రసారం చేయగా దానికి 8.4 టీఆర్పీ వచ్చింది. ఇక థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే స్కంద.. భగవంత్ కేసరిని దాటలేకపోయింది. ఇక అదే రోజున బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాను జీ తెలుగులో టెలికాస్ట్ చేయగా దానికి 9.6 రేటింగ్ వచ్చింది. అయితే థియేటర్లలోనే కాకుండా ఈ సినిమా టీవీలో కూడా సక్సెస్ అందుకుంది. బాలయ్య మూవీ ఎలా ఉన్నా కూడా అభిమానులు చూస్తారు అన్నదానికి ఇది నిదర్శనమని కొందరు.. జై బాలయ్య.. ఆయన ముందు నిలబడేవాళ్ళే లేరు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు.