భగవంత్ కేసరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చే వారమే థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. భగవంత్ కేసరి టీమ్‌తో లిమిటేడ్ ఎడిషన్ అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు భగవంత్ కేసరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయ్యి. ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. రన్ టైం వచ్చేసి 2గంటల 44 నిమిషాలు లాక్ చేశారు. ఇక ఈ మూవీ సెన్సార్ టాక్ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. సెన్సార్ వారు భగవంత్ కేసరికి పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో బాలయ్య, శ్రీలీల ఫన్ ఎమోషన్ అదిరిపోయిందట.
ముఖ్యంగా అఖండ నుంచి బాలయ్య ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న తమన్… ఈ సినిమాలో నెక్స్ట్ లెవల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడట. ఇంటర్వెల్ బ్లాక్‌కే క్లైమాక్స్ రేంజ్ బీజిఎంతో అదరగొట్టేశాడట. ఖచ్చితంగా ఈ సినిమా… తమన్ పై నెగెటివ్ కామెంట్స్ చేసిన వారికి గట్టి సమాధానం ఇస్తుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్‌లో బాలయ్య సెకండ్ లుక్ మామూలుగా లేదట. డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్యను ఓ రేంజ్‌లో ప్రజెంట్ చేశాడట. మొత్తంగా… సెన్సార్ టాక్ మాత్రం భగవంత్ కేసరి పై మరింత హైప్ ఎక్కించేలా ఉంది. దీంతో సూపర్ పాజిటివ్ రిపోర్ట్‌తో ఈ సినిమా థియేటర్లోకి రానుంది. అయితే అసలు టాక్ బయటికి రావాలంటే… అక్టోబర్ 19 వరకు వెయిట్ చేయాల్సిందే.