Bhabhi 2: జోయా నచ్చితే ఈ సినిమాలపై ఒక లుక్కెయ్యండి… ఇంకా నచ్చుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని నచ్చిన విషయం చెప్పండి అడిగితే… అందరి నుంచి కామన్ గా వచ్చే ఆన్సర్ “భాభీ 2”. రష్మిక హీరోయిన్ గా నటించిన అనిమల్ సినిమా సెకండ్ హాఫ్ లో “త్రిప్తి దిమ్రి” ఎంట్రీ ఇచ్చింది. రణబీర్ కపూర్ కి త్రిప్తి దిమ్రికి మధ్య సూపర్ ట్రాక్ ని రాసాడు సందీప్ రెడ్డి వంగ. గ్లామర్, రొమాన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్న ట్రాక్ పడడంతో అనిమల్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ జోయా క్యారెక్టర్ ప్లే చేసిన త్రిప్తి దిమ్రి తెగ నచ్చేసింది. పోస్ట్ రిలీజ్ అనిమల్ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే వంద పోస్టుల్లో 90 త్రిప్తి దిమ్రి గురించే ఉంటున్నాయి. అఫీషియల్ గా త్రిప్తి దిమ్రి ఇండియాకి కొత్త క్రష్ అయ్యింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఉన్న సినిమాలో కొత్త క్రష్ గా నిలవడం అంటే మాములు విషయం కాదు. తన యాక్టింగ్ స్కిల్స్ అండ్ గ్లామర్ తో త్రిప్తి దిమ్రి ఇప్పుడు యూత్ కి లవ్ ఇంట్రెస్ట్ గా మారిపోయింది.
ఉత్తరాఖండ్ కి చెందిన 29 ఏళ్ల త్రిప్తి దిమ్రి 2017లో పోస్టర్ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యింది. 2018లో లైలా మజ్ను సినిమా త్రిప్తి దిమ్రి కెరీర్ ని కంప్లీట్ గా టర్న్ చేసింది. లైలా త్రిప్తి దిమ్రి పెర్ఫార్మెన్స్ కి నార్త్ ఆడియన్స్ అండ్ క్రిటిక్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత అనుష్క శర్మ ప్రొడ్యూస్ చేసిన బుల్ బుల్ సినిమాలో కూడా త్రిప్తి దిమ్రి సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాలో కంప్లీట్ కొత్త త్రిప్తి దిమ్రి ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. త్రిప్తి దిమ్రికి సంబంధించి వైరల్ అవుతున్న ఫోటోస్ లో ఎక్కువశాతం బుల్ బుల్ సినిమావే… అంత ఇంపాక్ట్ ఇచ్చింది ఆ సినిమా. బుల్ బుల్, లైలా మజ్ను సినిమాలు చూస్తే త్రిప్తి దిమ్రి యాక్టింగ్ కెపాసిటీ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు అనిమల్ తో సూపర్ హిట్ కొట్టిన త్రిప్తి దిమ్రి, నెక్స్ట్ అనిమల్ పార్క్ మూవీలో ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించడం గ్యారెంటీ. ఆ సినిమాతో త్రిప్తి దిమ్రి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోతుంది.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!