Bellamkonda Srinivas: చరిత్ర సృష్టించిన బెల్లంకొండ.. వరల్డ్ రికార్డ్ సొంతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bellamkonda Srinivas Creates World Record With Jaya Janaki Nayaka: బెల్లంకొండ శ్రీనివాస్ వరుసగా ఆరు పరాజయాలు చవిచూసి ఉండొచ్చు.. కేవలం ఒక్క హిట్ మాత్రమే దక్కి ఉండొచ్చు.. కానీ స్టార్ హీరోలకి కూడా సాధ్యంకాని ఓ అరుదైన రికార్డ్‌ని మాత్రం నమోదు చేశాడు. అది కూడా ఏదో మామూలు రికార్డ్ కాదు, ఏకంగా వరల్డ్ రికార్డ్. తన ‘జయ జానకి నాయక’ సినిమాతో అతడు ఈ ఘనత సాధించాడు. ఈ సినిమాను హిందీలో ‘ఖూన్‌కార్’ టైటిల్‌తో డబ్ చేసి, యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే! ఇక అప్పటినుంచి ఇది వ్యూస్ పరంగా రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తోంది.
Samantha Ruth Prabhu: నాకు ఆ అవసరం లేదు.. తేల్చి చెప్పేసిన సమంత
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
మొదట్లో ఈ సినిమా అత్యంత వేగంగా 100, 200, 300 మిలియన్ వ్యూస్‌లను కొల్లగొట్టింది. ఆ తర్వాత మెల్లమెల్లగా 500 మిలియన్ మార్క్‌ని దాటేసింది. ఇప్పుడు ఇది ఏకంగా 700 మిలియన్‌కు పైగా వ్యూస్ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఇంతవరకు ఈ ఒక్క సినిమా కూడా ఈ స్థాయిలో వ్యూవర్షిప్ రాబట్టిన దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ సినిమాగా ఇన్ని వ్యూస్ నమోదు చేసింది. దీంతో.. ఇది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ రాబట్టిన వరల్డ్ రికార్డ్ సాధించింది. అంతేకాదు.. నాలుగు మిలియన్‌కి పైగా లైక్స్‌ని కూడా ఇది సొంతం చేసుకుంది. ఇప్పటికీ మంచి వ్యూస్‌తో ఈ సినిమా దూసుకెళ్తున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఇది మరిన్ని మైల్‌స్టోన్స్‌ని అందుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. ఇది బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్ డెబ్యూకి బాగా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు.
Priyanka Chopra: వాటితో విసిగిపోయా, అందుకే గుడ్‌బై చెప్పా.. ప్రియాంకా షాకింగ్ కామెంట్స్
కాగా.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన జయ జానకి నాయక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తరఫున రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించింది. ఇందులో జగపతి బాబు, శరత్ కుమార్, ధన్య బాలకృష్ణ, తరుణ్ అరోరా కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మరోవైపు.. చాలాకాలం నుంచి చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌కి సంబంధించి రీసెంట్‌గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇదే సమయంలో మే 12వ తేదీన ఇది రిలీజ్ కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు కూడా! మరి, యూట్యూబ్‌లో వండర్స్ క్రియేట్ చేసిన ఈ హీరో, బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అదే జోరుని కొనసాగిస్తాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!