Site icon NTV Telugu

Beast: కెజిఎఫ్ తో పోటీ పడుతున్న బీస్ట్.. నెగ్గుకొస్తుందా..?

beast

beast

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం బీస్ట్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిధి మారన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెల్సిందే. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించారు. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 13 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే యావత్ సినీ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న కెజిఎఫ్ 2.. ఏప్రిల్ 14 న రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమాకు ఒక రోజు ముందే బీస్ట్ రిలీజ్ కానుంది అంటే రెండు సినిమాలు పోటీకి దిగుతున్నట్లే.

రెండు పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్స్.. ఇద్దరు స్టార్ హీరోలు.. ఇద్దరు స్టార్ డైరెక్టర్స్.. అయితే పాన్ ఇండియా లెవల్లో కెజిఎఫ్ రిలీజ్ అవుతుంది.. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ రిలీజ్ అవుతుందని మరికొన్ని సినిమాలు వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. మరి అలాంటిది ఈ సినిమాకు పోటీగా విజయ్ రంగంలోకి ఎలా దిగుతున్నాడు..? సినిమాపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళ్ లో విజయ్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెజిఎఫ్ తో యష్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. మరి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాతో బీస్ట్ నెగ్గుకు రాగలదా..? అనేది తెలియాల్సి ఉంది. మరి చూడాలి ఏప్రిల్ లో ఏ హీరో హిట్ అందుకుంటాడో..

Exit mobile version