Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kanika Kapoor: బాలీవుడ్లో ఒకేలా కనిపించే నటీనటుల గురించి చర్చలు కొత్త విషయం కాదు. ఒకప్పుడు స్నేహా ఉల్లాల్‌ను ఐశ్వర్య రాయ్‌తో, జరీన్ ఖాన్‌ను కత్రినా కైఫ్‌తో పోల్చిన అభిమానులు, ఇప్పుడు మరో నటిపై అదే తరహా చర్చ మొదలుపెట్టారు. తాజాగా విడుదలైన ‘బత్వారా 1947’ పోస్టర్లో కనిపించిన నటి కనికా కపూర్‌ను చూసి చాలామంది కియారా అద్వానీగా భావించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ గందరగోళంపై కనికా తొలిసారిగా ఆసక్తికరంగా స్పందించారు.
‘ఏక్ దుజే కే వాస్తే 2’ సీరియల్‌తో పాటు ‘దోనో’ చిత్రంలో నటించిన కనికా కపూర్ ప్రస్తుతం రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న ‘బత్వారా 1947’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా పోస్టర్ విడుదలైన వెంటనే ఆమె లుక్‌ను చూసిన పలువురు నెటిజన్లు కియారా అద్వానీ అని పొరబడ్డారు. మరికొందరు ఇద్దరి మధ్య ఉన్న పోలికలపై సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు.
Also Read
- Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
- Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
ఈ అంశంపై స్పందించిన కనికా కపూర్, పోస్టర్ చూసి తనను కియారా అద్వానీగా భావించిన కామెంట్లు చూసి తనకు చాలా నవ్వొచ్చిందని చెప్పారు. గతంలో కూడా చాలామంది తనను కియారాతో పోల్చారని, కానీ ఈసారి వచ్చిన స్పందన మాత్రం మరింత ఎక్కువగా ఉందని తెలిపారు. సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులు కియారా కోసం వెతికితే చివరకు తానే కనిపిస్తానేమో అనిపించి సరదాగా నవ్వుకున్నానని వ్యాఖ్యానించారు.
కియారాతో పోల్చడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కనికా స్పష్టం చేశారు. చాలామంది ఇప్పటికే పలుమార్లు తాను కియారా లాగా కనిపిస్తానని చెప్పారని, అందులో తప్పేమీ లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా తన వెబ్ సిరీస్ ‘ఇమ్మెచ్యూర్ సీజన్ 2’ విడుదలైన తర్వాత కూడా ఇలాంటి పోలికలు ఎక్కువగా వినిపించాయని ఆమె గుర్తుచేశారు.
ఇదిలా ఉండగా, ‘బత్వారా 1947’ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నీ డియోల్, కరణ్ డియోల్, ప్రీతి జింటా, షబానా అజ్మీతో పాటు కనికా కపూర్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆమిర్ ఖాన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. పోస్టర్‌తోనే చర్చకు దారితీసిన ఈ సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
- Tags
- cinema
- kanika kapoor
తాజావార్తలు
-
Makutam Release Date: దర్శకుడిగా విశాల్‌కు తొలి పరీక్ష.. ‘మకుటం’ రిలీజ్ డేట్ ఫిక్స్, ట్రైలర్‌కు కౌంట్‌డౌన్!
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!