కరోనా మూడోవేవ్ మెల్ల మెల్లగా కనుమరుగవుతోంది. పరిస్థితులు అన్ని చోట్లా చక్కబడుతుండటంతో సాధారణ వాతావరణం నెలకొననుంది. దీంతో వాయిదా పడిన భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ వరుసగా విడుదలను ఖరారు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న రిలీజ్ అవుతుందని అధికారికంగా ప్రకటించగా ఈ రోజు ‘రాధే శ్యామ్’ను కూడా మార్చి 11న విడుదల చేస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే డిసి కామిక్ సూపర్ హీరో ‘బ్యాట్ మేన్’ సినిమను మార్చి 4న యుఎస్ లో విడుదల చేయబోతున్నారు. నిజానిని గతేడాది మార్చిలో విడుదల కావలసిన ఈ సినిమా కూడా కరోనా పాండమిక్ వల్ల వాయిదా పడింది.
Read Also : మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్ గా కాంట్రవర్సీ క్వీన్
సో యు.స్ మార్కెట్ లో మార్చి 4న భారీ స్థాయిలో విడుదల కాబోతోందన్నమాట. మన తెలుగు సినిమాలకు కూడా యుఎస్ పెద్ద మార్కెట్. ఒక వేళ సూపర్ హీరో ‘బ్యాట్ మేన్’కి మంచి రెస్పాన్స్ లభిస్తే… ఆ ప్రభావం హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 11న రానున్న ‘రాధేశ్యామ్’పై పడే అవకాశం ఉంది. మాట్ రీవ్స్ దర్శకత్వం వహించిన ‘బ్యాట్ మేన్’లో రాబర్ట్ పాటిన్ సన్, జెఫ్రీ రైట్, జో క్రావిటిజ్ ముఖ్య పాత్రలను పోషించారు. మరి ‘రాధేశ్యామ్’కి ‘బ్యాట్ మేన్’ దెబ్బ తగులుతుందో? లేదో? చూద్దాం.