అక్కినేని నాగార్జున , రమ్యకృష్ణ జంటగా నటించిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రంఎంతటి విహాయన్ని అందుకుందో ప్రత్యకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీలో ఐటెం పాటను మేకర్స్ రిలిక్ చేశారు.
‘జాతి రత్నాలు’ చిత్రంతో టాలీవుడ్ మొత్తానికి చిట్టిగా మారిపోయినా ఫరియా అబ్దుల్లా ఈ సాంగ్ లో చిందేసింది. వాసివాడి తస్సాదియ్యా .. పిల్ల జోరు అదిరిందయ్యా అంటూ సాగే ఈ పాటలో అక్కినేని సోగ్గాళ్లు నాగ్, చైతూలతో చిట్టి ఊర మాస్ స్టెప్పులు ఇరగదీసింది. ఇక అనూప్ సంగీత సారథ్యంలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అందించిన లిరిక్స్ క్యాచీగా ఉన్నాయి. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్ధన్ హస్కీ వాయిస్, శేఖర్ మాస్టర్ మాస్ స్టెప్పులతో ఈ పార్టీ సాంగ్ అదిరిపోయింది. ఇక ఇందులో రమ్య కృష్ణ కూడా మెరవడంతో సాంగ్ హైలెట్ గా నిలిచింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరి ఈ సినిమాతో నాగ్ మరో హిట్ ని అందుకుంటాడేమో చూడాలి.