బాలయ్యలోని అన్‌స్టాపబుల్ యాంగిల్‌ను చూసి జనాలు ఇంతలా ఎంటర్టైన్ అవుతారని… అల్లు అరవింద్ ఎలా గెస్ చేశారో తెలియదు గానీ బాలయ్య హోస్టింగ్ తో దుమ్ములేచిపోయింది ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో. ఒకరు ఇద్దరు అని కాదు… టాలీవుడ్ లెజెండ్స్ అందరితోనూ రచ్చ చేశారు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్… ఇప్పుడు మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. గత రెండు సీజన్లలో తన రెండు సినిమాల టీమ్‌తో సందడి చేసిన బాలయ్య… ఇప్పుడు భగవంత్ కేసరి టీమ్‌తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు అఖండ రిలీజ్ అయింది… సెకండ్ సీజన్‌లో వీరసింహారెడ్డి థియేటర్లోకి వచ్చింది. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను అందుకున్నాయి.
బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో రెండుసార్లు వంద కోట్లు రాబట్టాడు బాలయ్య. ఇక ఇప్పుడు మరో హండ్రేడ్ క్రోర్స్ కొట్టేందుకు భగవంత్ కేసరిగా వస్తున్నాడు. అయితే.. ఈ సినిమా రిలీజ్ సమయంలోనే అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ రావడం విశేషం. అసలు అన్‌స్టాపబుల్ ఆహా వారి కోసం చేస్తున్నట్టుగా లేదు… బాలయ్య సినిమాల కోసమే ఈ షో చేస్తున్నట్టుగా.. సీజన్‌కో సినిమాను ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నాడు బాలయ్య. తాజాగా మూడో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను భగవంత్ కేసరి మూవీ టీంతో స్టార్ట్ చేయనున్నారు. అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్‌గా రానున్న ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌ను అక్టోబర్ 17న ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. ఇప్పటికే భగవంత్ కేసరి హీరోయిన్లు కాజల్, శ్రీలీల, విలన్ అర్జున్ రామ్ పాల్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. దీంతో సీజన్ 3 కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అభిమానులు.