అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని చెప్పేశారు మేకర్స్. బాలయ్య సెంచరీ కొట్టడంపై ఎవరికీ ఎలాంటి డౌట్స్ లేవు కానీ పాన్ ఇండియా సినిమాల క్లాష్ లో కూడా బాలయ్య వంద కోట్లు కలెక్ట్ చేస్తాడా లేదా అనేది హాట్ టాపిక్ గా మారింది.
బాలయ్య వచ్చిన ఒక తర్వాత అక్టోబర్ 20న మాస్ మహారాజా నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’ రిలీజ్ కాబోతోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై హ్యూజ్ హైప్ ఉంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ అక్టోబర్ 19న రిలీజ్ కాబోతోంది. విజయ్‌కు తెలుగులో పెద్దగా మార్కెట్ లేకపోయినా.. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నాడు కాబట్టి భారీ అంచనాలున్నాయి. గతంలో లోకేష్ నుంచి వచ్చిన ఖైదీ, విక్రమ్ సినిమాలు ఇక్కడ భారీ విజయాలను అందుకున్నాయి. దీంతో దసరా వార్ విజయ్ వర్సెస్ బాలయ్య వర్సెస్ విజయ్ గా మారింది. ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ తప్పదనే చెప్పాలి. మరి ఈ ముగ్గురిలో ఎవరిది పై చేయి అవుతుంది? బాలయ్య హ్యాట్రిక్ సెంచరీ కొడతాడా? లేదా అనేది తెలియాలి అంటే అక్టోబర్ 19వరకు ఆగాల్సిందే.