Nandamuri Balakrishna: మొన్న ఎన్టీఆర్ చేసింది తప్పైతే.. ఇప్పుడు బాలయ్య చేసిందేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: నందమూరి కుటుంబం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఏ హీరో ఏది మాట్లాడినా సంచలనమే అవుతోంది. ఇక ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కానీ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కానీ టీడీపీ గురించి కానీ, వైసీపీ గురించి కానీ ఒక్క మాట మాటలాడిన అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటాడా..? లేదా.. అనేది ఇప్పటికి ఒక మిస్టరీగా కొనసాగుతూనే ఉంది. ఇక ఇదంతా పక్కన పెడితే నందమూరి కుటుంబంలో ఏ చిన్న సమస్య వచ్చినా, వేరేవారు ఆ కుటుంబాన్ని ట్రోల్ చేసినా అందరు ఒక్క మాట మీదనే ఉండి నందమూరి కుటుంబం స్పందిస్తోంది. ఇక అలా నందమూరి కుటుంబం మొత్తం ఇటీవల సీఎం జగన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై స్పందించారు. ముఖ్యంగా ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నో చర్చలకు దారి తీశాయి. ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్‌ఆర్ పేరు పెడితే… ఆయన గౌరవం పెరగదని చురకలు అంటించారు. ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదన్నారు ఎన్టీఆర్. యూనివర్సిటీ కి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక ఎన్టీఆర్ ఇంత నిదానంగా చెప్పడం, ముఖ్యంగా వైఎస్ఆర్ గురించి ఎన్టీఆర్ మాటలు వింటే ఆయనను ప్రశంసిస్తున్నట్లే ఉందని, తారక్ కన్నా అభిమానులే గట్టిగా ప్రశ్నిస్తున్నారు అని విమర్శించారు. ఎన్టీఆర్ కు తగ్గ మనవడు తారక్ కాదని కూడా తిట్టిపోశారు. ఈ విషయంలో తారక్ చేసింది పెద్ద తప్పని కూడా చెప్పుకొచ్చారు.
ఇక తారక్ విషయం పక్కన పెడితే.. నందమూరి బాలకృష్ణ సైతం వైఎస్ఆర్ ను ప్రశంసించడం టీడీపీ నేతలకు కానీ, నందమూరి అభిమానులకు కానీ రుచించడం లేదట. తాజాగా రిలీజైన అన్ స్టాపబుల్ ప్రోమోలో బాలయ్య “వైఎస్ఆర్ గ్రేట్.. లెజెండ్ ను మిస్ అయ్యాం”అని చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య అన్న మాటలను గౌరవం కొద్దీ అన్నారు అని కొందరు అంటున్నారు. అయితే అంతకుముందు ఎన్టీఆర్ ను ట్రోల్ చేసినప్పుడు ఇదే గౌరవం అనుకోవచ్చు కదా.. మరి అప్పుడు ఎందుకు ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారక్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారో చెప్పండి అని అడుగుతున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. రాజకీయాలలో చనిపోయిన వారి గురించి నెగెటివ్ గా మాట్లాడడం పద్దతి కాదు.. అందుకే చంద్రబాబు సైతం ఈ షో లో వైఎస్ఆర్ గురించి నెగెటివ్ గా మాట్లాడింది లేదు. ఇప్పుడు బాలయ్య కూడా అదే పద్దతిని పాటిస్తున్నారు అని మరికొందరు అంటున్నారు. ఇదంతా కరెక్ట్ అయినప్పుడు.. అప్పుడు తారక్ అన్న వ్యాఖ్యలను కూడా ఇలాగే పాజిటివ్ గా తీసుకోవాలి కానీ అప్పుడెందుకు తమ హీరోను నెగెటివ్ చేశారు అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
Also Read
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
- Samyuktha Menon: పుట్టినరోజు స్పెషల్ వీడియో.. ‘స్వయంభూ’లో వీరనారిగా సంయుక్త మీనన్!
- Mirzapur The Movie: ఓటీటీ సిరీస్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్.. 7 రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో ‘మీర్జాపూర్’!
తాజావార్తలు
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
-
Modi-Putin: “కార్ డిప్లమసీ”.. ఒకే కారులో మోడీ-పుతిన్..
-
ED raids : హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు.. AMR గ్రూప్‌పై సోదాలు..?
-
Pakistan Hindu Girls: కిడ్నాప్, మతమార్పిడి, పెళ్లి.. పాకిస్తాన్ కోర్టు బయట హిందూ బాలికల కన్నీళ్లు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?