నందమూరి నట సింహం బాలయ్య బాబు దసరా పండగని కొంచెం ముందే మొదలుపెట్టాడు. అక్టోబర్ 19 నుంచే నందమూరి అభిమానులకి దసరా ఫెస్టివల్ స్టార్ట్ అయిపోయింది. ఈ పండగ నందమూరి అభిమానులకి చాలా ఏండ్లు గుర్తుంటాది ఎందుకంటే ఇది సాలిడ్ క్లాష్ లో కొట్టిన హిట్, అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి కొట్టిన హిట్. దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ ల కాంబినేషన్ దసరా సీజన్ ని కమ్మేసింది. ఈ ఇద్దరి దెబ్బకి లియో సినిమా ప్రీబుకింగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసాయి. తెలుగు రాష్టాల్లో ఒక డబ్బింగ్ సినిమాకి ఆ రేంజ్ బుకింగ్స్ కి కలలో కూడా ఊహించి ఉండరు. LCU ఇంపాక్ట్ దెబ్బకి అన్ని సెంటర్స్ హౌజ్ ఫుల్ అయ్యాయి. ఇలాంటి సమయంలో బాలయ్య భగవంత్ కేసరి సౌండ్ కూడా సరిపోలేదు.
మొదటి రోజు మార్నింగ్ షో అయ్యే వరకూ అందరి నోటా లియో మాటనే. అప్పుడే బాలయ్య సత్తా ఏంటో తెలిసింది. మధ్యాహ్నం షో నుంచి బాలయ్య ర్యాంపేజ్ చూపించాడు. నైట్ షోస్ పడే సమయానికి అన్ని సెంటర్స్ లో బాలయ్యదే హవా. వారం తిరిగే లోపే బాలయ్య వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యేలా ఉన్నాడు అంటే భగవంత్ కేసరితో నట సింహం ఏ రేంజ్ బుకింగ్స్ రాబడుతుందో అర్ధం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా బాలయ్య 1.5 మిలియన్ చేరువలో ఉన్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కదిలి రావడంతో నిన్న పండగ రోజున భగవంత్ కేసరి బుకింగ్స్ ఫైర్ మోడ్ లో ఉన్నాయి. డే 2, డే 3, డే 4ల కన్నా ఎక్కువగా కలెక్షన్స్ ని నిన్న రాబట్టే రేంజ్ బుకింగ్స్ సొంతం చేసుకుంది. ఈరోజు కూడా భగవంత్ కేసరి స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తోంది. మరి భగవంత్ కేసరి ర్యాంపేజ్ కి ఫైనల్ ఫిగర్స్ ఎక్కడివరకూ వచ్చి ఆగుతాయో చూడాలి.