నందమూరి బాలకృష్ణ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను కూడా అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. బాలయ్యకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు బాలయ్య. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారి చిత్రపటంతో పాటు వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ నటించిన “అఖండ” చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాలయ్య అమ్మవారిని దర్శించుకున్నారు. “అఖండ” చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో ఇంకా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ “మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని ఇంత విజయవంతం చేసి దాన్ని నిరూపించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని అన్నారు.
Read Also : ముందు ‘పుష్ప’, వెనక ‘ఆర్ఆర్ఆర్’… అయినా తగ్గేదే లే !