Akhanda 2 : నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ మళ్లీ తన సరికొత్త అవతారంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ 2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఎగ్జైట్మెంట్ ఉంటుంది. వీరి కాంబోలో వచ్చిన అఖండ భారీ హిట్ కావడంతో రెండు పార్టుపై మంచి అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ హైప్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా ‘తాండవం’ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు.
Read Also : SSMB 29 : మళ్లీ కాపీ కొట్టిన జక్కన్న..? పృథ్వీరాజ్ లుక్ అక్కడి నుంచి వచ్చిందా..!
ఈ ప్రోమో చూస్తుంటే బాలయ్య మరల తన మాస్ ఎన్‌ర్జీతో స్క్రీన్‌ను కదిలించబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అఘోరా గెటప్‌లో ఆయన పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉంది. పవర్‌ఫుల్ ఎక్స్‌ప్రెషన్స్, గంభీరమైన లుక్స్, డైనమిక్ బాడీ లాంగ్వేజ్‌తో బాలయ్య మరోసారి తన తాండవం చూపించారు. మ్యూజిక్, విజువల్స్, లిరిక్స్ అన్నీ కలసి ఈ సాంగ్‌ను గ్రాండ్‌గా ఎలివేట్ చేస్తున్నాయి. ఫుల్ సాంగ్ రాబోతోందనే ఉత్కంఠ ఇప్పుడు అభిమానుల్లో పెరిగిపోయింది. బోయపాటి – బాలయ్య కాంబోలో ఇప్పటికే సింహా, లెజెండ్, అఖండ వంటి బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారేమో చూడాలి.
Read Also : CM Revanth Reddy : ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థలకు సీఎం రేవంత్ వార్నింగ్..