జై బాలయ్య అంటే చాలు.. నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. దాంతో చాలా ఏళ్లుగా జై బాలయ్య అనేది.. ఓ స్లోగాన్‌గా మారిపోయింది. ఇక థియేటర్స్ అయితే.. ఈ నినాదాని షేక్ అయిపోతుంటాయి. ఒక్క సినిమా విషయంలోనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా.. జై బాలయ్య అంటూ హల్ చల్ చేస్తుంటారు అభిమానులు. అలాంటిది అదే టైటిల్‌తో బాలకృష్ణ సినిమా వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పడు బాలయ్య అప్ కమింగ్ ప్రాజెక్ట్ కోసం ఇదే టైటిల్ ఫిక్స్ చేశారట.
నందమూరి నటసింహం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. అలాగే గోపీచంద్ క్రాక్ సినిమాతో ఫామ్ లోకి రావడంతో ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు. పైగా అఖండ తరహాలోనే మాస్ యాక్షన్ అంశాలతో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. NBK107 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో గత కొంత కాలంగా అనేక వార్తలొస్తున్నాయి.
ముందుగా అన్నగారు అనే టైటిల్ అనుకున్నట్లుగా టాక్ వచ్చింది. ఆ తర్వాత పెద్దన్న.. జై బాలయ్య.. అనే టైటిల్స్ వినిపించాయి. కానీ ఏది కూడా ఫైనల్ కాలేదు.. అయితే తాజాగా ‘జై బాలయ్య’ టైటిల్‌నే.. ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారట. మామూలుగానే బాలయ్య ఎక్కడికెళ్లినా ‘జై బాలయ్య’ అనే నినాదం వినిపిస్తుంటుంది. సోషల్ మీడియాలో కూడా ఇదే ట్రెండింగ్‌లో వస్తుంటుంది. ఇక ఇప్పుడు అదే టైటిల్‌తో సినిమా అంటే.. థియేటర్ దద్దరిల్లిపోవడం ఖాయమంటున్నారు. అయితే జై బాలయ్య టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.