Lakshmi Narasimha : నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా పరిశ్రమలో ‘నట సింహం’గా పేరు తెచ్చుకున్న హీరో. బాలకృష్ణ 65వ జన్మదిన వేడుకలను అభిమానులకు మరపురాని అనుభవంగా మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం లక్ష్మీ నరసింహా (2004) రీ-రిలీజ్‌తో అభిమానులకు సందడిని మళ్లీ తెరపై చూపించడానికి సిద్ధమవుతున్నారు మేకర్స్. ఈ సినిమా జూన్ 7, 2025 నుంచి 4K ఫార్మాట్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ రీ-రిలీజ్‌ను బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేశారు మేకర్స్. 2004లో జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో, శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మించిన లక్ష్మీ నరసింహా విడుదలైనప్పుడు 272 కేంద్రాలలో 50 రోజులు, 87 కేంద్రాలలో 100 రోజులు ఆడి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది.
Read Also : Nabha : ఈ సంతోషాలు ఇచ్చినందుకు రుణపడి ఉంటా!
ఈ రీ-రిలీజ్‌ను మరింత ప్రత్యేకం చేయడానికి, లక్ష్మీ నరసింహా టీం ఒక సరికొత్త సాంగ్‌ను జోడించింది. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ సాంగ్‌ను ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ పాటలో బాలకృష్ణ యొక్క అన్‌సీన్ విజువల్స్‌తో పాటు భీమ్స్ యొక్క మాస్ బీట్‌లు కలిసి ఒక ‘పార్టీ యాంథమ్’గా రూపొందాయని, ఇది థియేటర్లలో అభిమానులకు మాస్ జాతరను అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. మందేసినోడు ఘనుడు మ్యాన్షన్ హౌసేసినోడు మహానుభావుడు అంటూ సాగుతున్న సాంగ్ ను స్వరాగ్ కీర్తన్ ఆలపించారు. ఈ పాటతో పాటు, రీ-రిలీజ్ ట్రైలర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.
Read Also : Bengaluru Stampede: తొక్కిసలాట బాధితులలో చాలామంది డిశ్చార్జ్.. 14 ఏళ్ల బాలుడు ఇంకా అబ్జర్వేషన్‌లోనే..!
