Balakrishna : నందమూరి బాలకృష్ణ పైకి ఎంత గంభీరంగా ఉంటారో.. లోపల అంతే ఎమోషనల్ గా ఉంటారు. చాలా రేర్ గా తన ఎమోషన్ ను బయటకు చూపిస్తుంటారు. ఈ రోజు నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ ఆనారోగ్యం కారణంగా ఇవాళ ఉదయం మృతి చెందారు. పద్మజ భౌతికకాయానికి నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు కూడా నివాళి అర్పించారు.
Read Also : HHVM : ఓటీటీలోకి వీరమల్లు.. ఎక్కడ, ఎప్పటి నుంచి..?
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడే క్రమంలో పక్కనే ఉన్న బాలకృష్ణ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది. ఆయన ఇలా ఎమోషన్ అవుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. బాలకృష్ణ మనసు చాలా సున్నితం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ అఖండ-2లో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్లలోకి రాబోతోంది.
Read Also : Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ సూపర్ అంతే..