Balakrishna Fans: మాకేందిరా ఈ శిక్ష అంటున్న బాలయ్య ఫాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna Fans on Re Release Movies: టాలీవుడ్లో ఇప్పుడు ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను వారి అభిమానులు డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సింహాద్రి, ఖుషి, జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఆరెంజ్, రఘువరన్ బీటెక్, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఇలా చాలా సినిమాలు అభిమానులను అలరించాయి. సింహాద్రి, ఖుషి, పోకిరి వంటి సినిమాలైతే రీ రిలీజ్ అయిన తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించి అందరినీ షాక్ కి కూడా గురి చేశాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు బాధ పడుతున్నారు.
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
ఎందుకంటే నందమూరి బాలకృష్ణ కెరీర్ లో దారుణంగా డిజాస్టర్ లుగా భావించే సినిమాలను రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకోవడమే. రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగానే బాలకృష్ణ నటించిన ఒక్క మగాడు, లయన్ సినిమాలు రీ రిలీజ్ చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నిజానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి, ఇప్పుడు టీవీల్లో వస్తేనే ఈ సినిమాలను చూడడానికి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఇష్టపడరు. అలాంటిది ఈ బోరింగ్ మూవీస్ ను మళ్ళీ థియేటర్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు అని బాలయ్య అభిమానులు ఫైర్ అవుతున్నారు.

బాలకృష్ణ నటించిన లెజెండ్, సింహా, లక్ష్మీ నరసింహ లాంటి సినిమాలు ఉండగా ఇలాంటి సినిమాలు రిలీజ్ చేయడమేంటని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈమధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాల కలెక్షన్స్ విషయంలో కూడా అభిమానుల మధ్య పోటీ ఏర్పడుతోంది. మా హీరో రి రిలీజ్ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది అని చెప్పుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నా వాటన్నింటినీ పక్కన పెట్టేసి పొరపాటున టీవీల్లో వచ్చిన లేక ఓటీటీలో కూడా చూడటానికి ఆసక్తి చూపించని సినిమాలు రిలీజ్ చేయడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే అనుమానాలను కూడా సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ విషయం మీద ఆ రీ రిలీజ్ చేస్తున్న నిర్మాతలకు తెలియాలి. నిజానికి ప్రస్తుతం బాలకృష్ణ… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోందాగి ఇక బాలకృష్ణ కూతురి పాత్రలో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీ అక్టోబర్ 19న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!