ఇప్పటి వరకూ తెలుగు బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. 7వ సీజన్ కి రెడీ అవుతోంది. మరి కొద్ది నెలల్లో 7వ సీజన్ మొదలు కానుంది. బిగ్ బాస్ 6కి ఘోరంగా వైఫల్యం చెందటంతో ఈ సారి హోస్ట్ మారతాడని బలంగా వినిపించింది. అయితే అలాంటిదేమీ లేదని 7వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ అని తేలింది. స్టార్ మా ద్వారా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు తొలి 5 సీజన్స్ లో మంచి టీఆర్ పిలనే రాబట్టింది. అయితే ఎప్పుడైతే ఓటీటీలో బిగ్ బాస్ మొదలు
పెట్టారో అప్పుడే పతనం స్టార్ట్ అయింది. తొలి సీజన్ లోనే ఓటీటీలో బిగ్ బాస్ అట్టర్ ప్లాఫ్ అనిపించుకుంది. దాని ప్రభావం బిగ్ బాస్ 6 మీద కూడా పడింది. దానికి తోడు ఊరు పేరు లేని పోటీదారులు పార్టిసిపేట్ చేయటం కూడా దెబ్బతీసింది. టిఆర్ పీ దారుణంగా పడిపోయింది. బిగ్ బాస్ 6తో ఇక మరో సీజన్ ఉండదు అనేంత ప్రచారం జరిగింది. ఇప్పుడిపుడే దాని నుంచి కోలుకుని స్టార్ మా మారో సీజన్ కి రెడీ అవుతోంది. ఇక నిర్వాహకులు ఈ సారి హోస్ట్ గా బాలకృష్ణను రంగంలోకి దించాలనుకున్నారు. దానికి తగ్గట్లే ప్రయత్నాలు కూడా జరిగాయి.
అన్ స్టాపబుల్ లో ‘ఆహా’కే ఓ క్రేజ్ తీసుకు వచ్చిన బాలయ్య అయితే సీజన్ 7పై ఆసక్తి పెరుగుతుందనే అంచనాతో భారీ పారితోషికానికైనా సిద్ధపడ్డారు. అయితే బిగ్ బాస్ నిర్వాహకుల ఆశలపై బాలకృష్ణ నీళ్ళు చల్లారట. తను చేయనని చెప్పినట్లు తెలుస్తోంది. పారితోషికంతో బాలయ్యను కొనాలని చూసినా ఆయన ససేమిరా అన్నారట. తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే 15 కోట్ల హైయెస్ట్ ఆఫర్ కూడా ఇచ్చారట. నిజానికి ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న 11 కోట్లే హైయెస్ట్. నాని 3 కోట్ల పారితోషికం తీసుకోగా నాగార్జున 7 కోట్ల వరకూ తీసుకున్నట్లు సమాచారం. బాలయ్య నో చెప్పటంతో ఇక నిర్వాహకులకు నాగార్జుననే దిక్కయ్యారు. గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టకుని ఈసారి కంటెస్టెంట్స్ విషయంలో కొద్దగా జాగ్రత్త పడనున్నారట. పేరున్న సెలబ్రెటీలు కొందరు బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేయబోతున్నట్లు సమాచారం. మరి ఓటీటీ తో పాటు బిగ్ బాస్ 6తో పోగొట్టుకున్న పరువును బిగ్ బాస్ సీజన్ 7 నిలబెడుతుందేమో చూద్దాం.