Bahubali Producer Sobhu Yarlagadda Praises Hanuman team: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన మొదటి సూపర్ హీరో సినిమా హనుమాన్. ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అనేక రికార్డులు బద్దలు కొడుతూ వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఇక ఈ సినిమా చూసిన సెలబ్రిటీల సైతం సినిమాకి ఫిదా అయిపోతున్నారు. తాజాగా బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఈ సినిమా చూసి తన ఆనందం వ్యక్తం చేయడమే కాదు సినిమా యూనిట్ మీద ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడే హనుమాన్ సినిమా చూశానని ఇది ఒక బ్రిలియంట్ సూపర్ హీరో మూవీ అని చెప్పుకొచ్చారు,. దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాని ఎలాంటి తప్పులు లేకుండా తర్కెక్కించాడని కంప్యూటర్ గ్రాఫిక్స్ ని విఎఫ్ఎక్స్ ని భలే తెలివిగా వాడుకున్నాడని చెప్పుకొచ్చారు.
Hanuman: నిన్న భజరంగీ.. నేడు కాంతార.. హనుమాన్ పై కన్నడ నటుల ప్రశంసలు
తేజ సబ్జా కూడా భలే బ్రిలియంట్ గా నటించాడని సినిమా మొత్తాన్ని చాలా సులభంగా నడిపించే ప్రయత్నం చేశాడని చెప్పుకొచ్చారు. ఇక నిరంజన్ రెడ్డి సినిమా నిర్మించినందుకు చాలా ఆనందంగా ఉందని టీం మొత్తానికి కంగ్రాట్స్ చెబుతూ ఆయన ట్వీట్ చేశారు. ఇక దానికి ప్రశాంత్ వర్మ స్పందిస్తూ ఇది మాకు ఎంతో ఆనందం కలిగించే విషయం సార్ థాంక్యూ అని పేర్కొన్నారు. ఇప్పటికే వసూళ్ల విషయంలో పలు రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో అయితే టాప్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి కలెక్షన్స్ విషయంలో ముందుకు దూసుకు వెళ్లి పోతుంది.
Means a lot coming from you sir. Thank you! 🙂 https://t.co/bpTu4O4rkX
— Prasanth Varma (@PrasanthVarma) January 17, 2024