NTV Telugu Site icon

Bachhala Malli: “మా ఊరి జాతరలో” అని పాట పాడుకుంటున్న అల్లరోడు

Maxresdefault

Maxresdefault

Allari Naresh Upcoming Movie Bachhala Malli First Single: అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న చిత్రం “బచ్చల మల్లి”. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగ సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి హీరో నరేష్ బర్త్‌డే గ్లింప్స్ మరియు పోస్టర్స్ కి కూడా మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌ని కిక్ స్టార్ట్ చేశారు. తాజాగా ఇవాళ “మా ఊరి జాతరలో” అనే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేసారు మేకర్స్.

Also Read: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!

‘సీతారామం’ ఫేం విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ను గౌరీ హరి, సింధు విశాల్ ఆలపించిగ శ్రీమణి లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియా వేదికగా వైరల్ కానుంది. ఇక ఈ మూవీలో నరేష్ ఇంతకు ముందు ఎన్నడూ చేయని మాస్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. అల్లరి నరేష్‌ని డైరెక్టర్ సుబ్బు మునుపెన్నడూ చూడని అవతార్‌లో ప్రెజెంట్ చేయబోతున్నారు. ఆ విషయం రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ చూస్తుంటేనే తెలిసిపోతోంది. అలానే ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Show comments