Baby: ఆనంద్ దేవరకొండ గతేడాది హైవే అనే సినిమాతో ఓటిటీ ప్రేక్షకులను అలరించాడు. ఇక ఆ సినిమా తరువాత ప్రస్తుతం బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను SKN నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. స్కూల్, కాలేజ్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జూలై 14 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అయితే ఇక్కడవరకు బాగానే ఉన్నా.. రిలీజ్ డేట్ తో పాటు రిలీజ్ చేసిన పోస్టరే కొద్దిగా వివాదంగా మారేలా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి.
Bro Teaser: బ్రో.. టీజర్ కన్నా ముందే పోస్టర్లతో చంపేస్తున్నారుగా
ఒక చెయ్యి.. ఆ చెయ్యి మిడిల్ ఫింగర్ గా హీరోయిన్ వైష్ణవి చైతన్య ను చూపించారు. పింక్ కలర్ డ్రెస్ లో ఆమె నవ్వుతు కనిపించింది. అమ్మాయిని అలా మిడిల్ ఫింగర్ గా చూపించడమేంటి అని అందరు విడ్డురంగా చూస్తుండగా.. ఈ పోస్టర్ ను చూస్తుంటే కథ ఏదో కొత్తగా ఉండేలా ఉందే అని చెప్పుకొస్తున్నారు. ఇక పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. ఇక ఈ సినిమాపై నిర్మాత SKN సైతం ఒక ట్వీట్ చేశాడు. ” బేబీ ఫస్ట్ కాపీ చూసాను. ఈ సినిమాను నేను నిర్మించినందుకు.. ఎంతో ఆనందంగా.. గర్వంగా ఫీల్ అవుతున్నాను. దయచేసి అందరు మా సినిమాకు సపోర్ట్ చేయండి” అని చెప్పుకొచ్చాడు. మరి ఈ పోస్టర్ వివాదాస్పదం కాకుండా ఉంటుందా.. లేదా..? అనేది చూడాలి.