Babu Mohan : కోట శ్రీనివాస్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాస్ తో ఎంతో అనుబంధం ఉన్న బాబు మోహన్ ఆయన ఇంటికి వచ్చి సంతాపం తెలిపారు. కోట శ్రీనివాస్ కు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్ అందరికంటే నాకు ఆత్మీయుడు. నాకు సొంత అన్న లాంటి వాడు. ఆయనకు తమ్ముడు ఉన్నా నన్నే సొంత తమ్ముడిగా చూసుకున్నారు. మొన్న సాయంత్రం కూడా ఓ షూటింగ్ విషయంలో ఫోన్ చేశాను. ఎప్పుడు వస్తావ్ రా అని అడిగాడు. రేపు వస్తానని చెప్పాను.
Read Also : Kota Srinivas Death : కోట శ్రీనివాస్ కు ఎన్టీఆర్, మహేశ్ సంతాపం..
నేను వచ్చేసరికి కోటన్న లేడు. వెళ్లిపోయాడు అంటూ ఏడ్చాడు బాబు మోహన్. తనను తాను తటపటాయించుకున్న తర్వాత మాట్లాడుతూ.. కోట శ్రీనివాస్, నేను ఎప్పుడు కలిసినా చమత్కారంగానే మాట్లాడుకుంటాం. ఒకే ప్లేట్ లో తినేవాళ్లం. ఆయన ఎన్నో సార్లు నాకు అన్నం తినిపించారు. ఆయన ఎక్కడున్నా నాకు ఫోన్ చేయకుండా ఉండేవాడు కాదు. సినిమాల్లోకి వచ్చాక నాకు ఒక సపోర్ట్ గా ఉన్నాడు కోటన్న. ఆయన ఈ రోజు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. ఆయన లాంటి వ్యక్తి మళ్లీ దొరకడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ తెలిపారు బాబు మోహన్.
Read Also : Kota Srinivasa Rao Death : కోట మరణం.. లైవ్ లో ఏడ్చేసిన బ్రహ్మానందం